చరిత్ర సృష్టించిన అశ్విన్...కుంబ్లే రికార్డ్ బద్దలు

By :  Vinitha
Update: 2024-02-25 08:28 GMT

టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చరిత్ర సృష్టించాడు. స్వ‌దేశంలో అత్య‌ధిక వికెట్లు తీసిన భార‌త బౌల‌ర్‌గా సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్ర‌మంలో స్పిన్ దిగ్గ‌జం అనిల్ కుంబ్లే రికార్డును అశ్విన్ బ‌ద్ద‌లు కొట్టాడు. అంత‌ర్జాతీయ క్రికెట్ లో ఓవ‌రాల్‌గా ఈ ఘ‌న‌త సాధించిన ఐదో ఆట‌గాడిగా నిలిచాడు. రాంచీ వేదికగా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న నాలుగో టెస్టు మ్యాచులో అశ్విన్ ఈ ఘ‌న‌త‌ను సాధించాడు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ ఆటగాళ్లను వ‌రుస బంతుల్లో బెన్ డ‌కెట్‌, ఓలీపోప్‌ల‌ను ఔట్ చేసి పెవిలియన్ పంపిచాడు. దీంతో కుంబ్లే రికార్డును తిరగరాస్తూ..స్వదేశంలో అశ్విన్ తీసిన వికెట్ల సంఖ్య 352కి చేరింది.

Tags:    

Similar News