జియో దెబ్బకు దిగొచ్చిన హాట్ స్టార్.. ఇకపై ఫ్రీ స్ట్రీమింగ్
జియో సినిమా దెబ్బకు డిస్నీ+హాట్ స్టార్ దిగొచ్చింది. క్రికెట్ ప్రేమికులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో జరిగే ఆసియా కప్ 2023, వరల్డ్ కప్ 2023 మ్యాచ్ల లైవ్ స్ట్రీమింగ్ను మొబైల్లో ఉచితంగా ప్రసారం చేయనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా ఎలాంటి సబ్స్క్రిప్షన్ లేకుండా హాట్స్టార్లో ఫ్రీగా లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు. ఐపీఎల్ 2023 ప్రసార హక్కులను జియో సినిమా దక్కించుకుని.. ఫ్రీగా టెలికాస్ట్ చేసిన విషయం తెలిసిందే. దాంతో హాట్స్టార్ భారీగా సబ్స్క్రైబర్లను కోల్పోయింది. ఈ విపత్కర పరిస్థితుల నుంచి బయటపడేందుకు డిస్నీ హాట్స్టార్.. ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్లో ప్రతీ మ్యాచ్ను యావరేజ్గా 2 కోట్ల మంది వీక్షించగా.. ఫైనల్ మ్యాచ్లో ఏకంగా 3 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఈ దెబ్బతో టెలివిజన్ వ్యూవర్షిప్కు భారీగా తగ్గపోయింది. ఈ దెబ్బతో హాట్ స్టార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో దాదాపు 54 కోట్లమంది యూజర్లకు ప్రయోజనం దక్కనుంది.