World cup 2023: హైదరాబాద్లో ఉంటే.. పాకిస్తాన్ గడ్డపై ఉన్నటుంది: పాక్ క్రికెటర్
పాకిస్తాన్ వార్మప్ మ్యాచులే కాకుండా.. వరల్డ్ కప్ లో కొన్ని మెయిన్ మ్యాచ్ లు కూడా ఉప్పల్ స్టేడియంలోనే ఉన్నాయి. దాంతో పాక్ జట్టంతా వారంలో రోజుల పాటు హైదరాబాద్ లోనే ఉంటుంది. ఇప్పడు బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్ లో బస చేస్తుంది. భారత్ లో అడుగుపెట్టిన ఆ జట్టుకు ఇక్కడి అభిమానులు ఘన స్వాగతం పలికిన విషయం తెలిసిందే. దాదాపు 12 ఏళ్ల తర్వాత భారత గడ్డపై అడుగుపెట్టిన పాక్.. ఇప్పటికే వరల్డ్ కప్ కోసం సన్నద్ధం అవుతుంది. ఉప్పల్ స్టేడియంలో శ్రమిస్తోంది. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన పాక్ ఆటగాడు షాదాబ్ ఖాన్.. ఉప్పల్ స్టేడియంపై కీలక వ్యాఖ్యలు చేశాడు.
హైదరాబాద్ వాతావరణం, ప్లేయింగ్ కండిషన్స్ పాక్ లో ఉన్నట్లే ఉన్నాయి. మా రావల్పిండి పిచ్ కండిషన్ ఎలా ఉంటుందో ఉప్పల్ పిచ్ కూడా అలానే ఉంటుందని చెప్పుకొచ్చాడు. హైదరాబాద్ ఆతిథ్యం బాగా నచ్చిందని, ఇక్కడి ఫుడ్ తమకు చాలా నచ్చిందని అన్నాడు. ఇక్కడి ఫుడ్ తింటే ఖచ్చితంగా తమ ఆటగాళ్లు లావు అవుతారని చెప్పుకొచ్చాడు. ఇదే ఆతిథ్యం అహ్మదాబాద్ లో కూడా ఉండాలని ఆశిస్తున్నామన్నాడు. పాక్ బౌలింగ్ ఇంకా మెరుగుపడాలని, న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో తమ బౌలర్లు ఫెయిల్ అవ్వడం ఆందోళనకు గురిచేసిందన్నాడు. తన ఆటపై దృష్టి పెట్టానని, టోర్నీలో ఖచ్చితంగా రాణిస్తానని చెప్పుకొచ్చాడు.