ఐసీసీ కీలక నిర్ణయం

Update: 2023-07-13 16:12 GMT

మహిళల క్రికెట్‌ జట్లకు ఐసీసీ గుడ్ న్యూస్‌ చెప్పింది. ఐసీసీ నిర్వహించే ఈవెలంట్‌లలో పురుషుల మరియు మహిళల జట్లకు సమాన ప్రైజ్ మనీని ప్రకటించింది. అదే సమయంలో టెస్ట్ క్రికెట్‌లో ఓవర్ రేట్ ఆంక్షలకు కూడా మార్పులు చేసింది. దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో జరిగిన ఐసీసీ వార్షిక కాన్ఫరెన్స్‌లో ఈ నిర్ణయం తీసుకుంది.

ఇది క్రీడా చరిత్రలో అత్యంత ముఖ్యమైన ఘట్టమని ICC ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే అన్నారు. పురుషులకు సమానంగా మహిళలు క్రికెటర్లు సమానంగా రివార్డులు అందుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. పురుష, మహిళలకు సమాన ప్రైజ్ మనీ అందించాలనే దృష్టితో 2017 నుంచి ప్రతి సంవత్సరం హిళల ఈవెంట్‌లలో ప్రైజ్ మనీని పెంచుతూ ఉన్నట్లు వివరించారు.


Tags:    

Similar News