T20 World Cup 2024: పని మొదలుపెట్టిన ఐసీసీ.. ఈ టీ20 వరల్డ్కప్ కాస్త స్పెషల్

By :  Bharath
Update: 2023-09-23 12:18 GMT

2023 వన్డే వరల్డ్ కప్ ఇంకా మొదలు కానేలేదు.. ఐసీసీ అప్పుడే టీ20 వరల్డ్ కప్ 2024 పనిలో పడింది. ఇప్పటికే ఆతిథ్యం ఇచ్చే స్టేడియాలను పరిశీలించిన ఐసీసీ బృంధం.. కొన్ని స్టేడియాలను ఫైనల్ చేసింది. కరేబియన్‌లోని ఆంటిగ్వా, బార్బుడా, బార్బడోస్, డొమినికా, గయానా, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్ అండ్ ది గ్రెనడైన్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, యూఎస్ఏలోని డల్లాస్, ఫ్లోరిడా, న్యూయార్క్ స్టేడియాలు టీ20 ప్రపంచకప్ కు ఆతిథ్యం ఇస్తున్నాయి. కాగా తాజాగా ప్రపంచకప్ తేదీలను ప్రకటించింది ఐసీసీ. 2024 జూన్ 4 టోర్నీ ప్రారంభం కాగా.. జూన్ 30న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.

ఓ మెగా టోర్నీకి అమెరికా అతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి కావడం విశేషం. అంతేకాదు ఆతిథ్యం ఇస్తున్న దేశం కాబట్టి అమెరికా నేరుగా వరల్డ్ కప్ కు అర్హత సాధించింది. ఈ సందర్భంగా ఐసీసీ చీఫ్ జియోఫ్ అల్లార్డిన్ మాట్లాడుతూ ‘20 జట్లు పాల్గొటున్న ఈ మెగా టోర్నీకి వేదికలు ప్రకటించడం ఆనందంగా ఉంది. వెస్టిండీస్ హోస్ట్ చేసే మూడవ ఐసీసీ పురుషుల టోర్నీ కావడం విశేషం. అమెరికా, వెస్టిండీస్ లకు ఈ వరల్డ్ కప్ చాలా ప్రత్యేకం కానుంది’ అని అన్నారు. ఈ టోర్నీలో అమెరికా, వెస్టిండీస్ తో పాటు.. భారత్, పాకిస్తాన్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఇప్పటికే అర్హత సాధించాయి. మరో 8 జట్లు క్వాలిఫై మ్యాచులు ఆడాల్సి ఉంది.

Tags:    

Similar News