వరల్డ్ కప్ -2023 షెడ్యూల్ మారింది...

Update: 2023-08-09 13:37 GMT

వరల్డ్ కప్ -2023 షెడ్యూల్‌లో ఐసీసీ మార్పులు చేసింది. కొత్త షెడ్యూల్‌ను తాజాగా ప్రకటించింది. దీని ప్రకారం హై హోల్టేజ్ భారత్ - పాక్ మ్యాచ్‌ తో పాటు మరో 9 మ్యాచ్ ల తేదీల్లో మార్పులు జరిగాయి. గతంలో ప్రకటించిన వరల్డ్ కప్ షెడ్యూల్ ప్రకారం భారత్ - పాక్ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆక్టోబర్ 15న జరగాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఆక్టోబర్ 14న అదే వేదికపై నిర్వహించనున్నారు. అక్టోబర్ 15 నుంచి అహ్మదాబాద్‌లో నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. అదే రోజు భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య హైప్రొఫైల్ మ్యాచ్ జరిగితే భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వార్తలు రావడంతో షెడ్యూల్ ను మార్చినట్లు తెలుస్తోంది. ఐసీసీ కొత్త షెడ్యూల్ ప్రకారం 9 మ్యాచ్‌ల తేదీలు మారాయి. ఇందులో భారత్‌తో 2 మ్యాచ్‌లు, పాకిస్థాన్‌తో 3 మ్యాచ్‌లు ఉన్నాయి.

ఆక్టోబర్ 14న జరగాల్సిన ఇంగ్లండ్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ ఆక్టోబర్ 15కి మార్చబడింది. ఆక్టోబర్ 12 న హైదరాబాద్ వేదికగా జరగాల్సిన పాక్-శ్రీలంక మ్యాచ్ ఆక్టోబర్ 10కి షెడ్యూల్ చేయబడింది. నెదర్లాండ్స్‌తో భారత్ ఆడాల్సిన చివరి లీగ్ గేమ్ కూడా నవంబర్ 11 నుండి 12కి మార్చబడింది.దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా మ్యాచ్ అక్టోబర్ 13 శుక్రవారం కాకుండా ఒక రోజు ముందుగా ఆక్టోబర్ 12న తలపడనుంది. బంగ్లాదేశ్ షెడ్యూల్‌లో కూడా కొన్ని మార్పులు జరిగాయి. బంగ్లాదేశ్ -న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ ఆక్టోబర్ 14 నుంచి 13కి మార్చబడింది. ఆక్టోబర్ 10న ఇంగ్లండ్ -బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన డే నైట్ మ్యాచ్ ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. నవంబర్ 12 ఆదివారం జరిగాల్సిన ఆస్ట్రేలియా vs పాకిస్తాన్, ఇంగ్లాండ్ vs పాకిస్తాన్ మ్యాచ్ లు ఒకరోజు ముందుకి మార్చబడ్డాయి. ప్రపంచ కప్ అక్టోబర్ 05 న అహ్మదాబాద్‌లో ప్రారంభమవుతుంది, ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19 న అదే వేదికపై జరగనుంది

ICC announces World Cup new schedule, India vs Pakistan game shifted to October 14

ICC, announces, changes in World Cup schedule, India vs Pakistan game, shifted to October 14

Tags:    

Similar News