టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్పై నిషేదం విధించిన ఐసీసీ

Update: 2023-07-25 17:09 GMT

బంగ్లాదేశ్ మహిళల జట్టు, భారత్ మధ్య జరిగి మూడు వన్డేల సిరీస్ 1-1తో సమం అయ్యింది. ఢాకా వేదికగా జరిగిన నిర్ణయాత్మక మూడో టైగా ముగియడంతో ట్రోఫీని ఇరుజట్లు పంచుకున్నాయి. గెలుపుకు ఒక్క పరుగు దూరంలో నిలిచిపోవడం భారత్ ఆటగాళ్లను, అభిమానులను నిరాశపరిచ్చింది. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్‎కౌర్ తన సహనాన్ని కోల్పోయింది. అంపైర్ నిర్ణయంపై క్రీజ్‎లోనే తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. భారత ఇన్నింగ్స్‌ 34 ఓవర్‌ వేసిన నహిదా అక్తర్‌ బౌలింగ్‌లో మూడో బంతిని హర్మన్‌ప్రీత్ లెగ్‌ సైడ్‌ ఆడే ప్రయత్నం చేసింది. అయితే బంతి బ్యాట్‌కు మిస్స్‌ అయ్యి ప్యాడ్‌కు తాకింది. బంగ్లా ఆటగాళ్లు ఎల్బీకి అప్పీల్ చేయగా.. అంపైర్ ఔట్‎గా ప్రకటించాడు. దీంతో అంపైర్‌ నిర్ణయంపై హార్మన్‌ ప్రీత్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. కోపంతో రగిలిపోయి వికెట్స్‌ను బ్యాట్‌తో కొట్టింది. మ్యాచ్ తర్వాత అంపైర్ ను బహింరంగంగా దూషించింది.

ఈ చర్యకు గానూ హర్మన్ ప్రీత్ మ్యాచ్ ఫీజులో 50శాతం కోత విధించింది. అంతేకాకుండా డిసిప్లినరీ రికార్డ్స్ లో 3శాతం డిమెరిట్ పాయింట్ల తగ్గించింది. అంతేకాకుండా అంపైర్ ను బహిరంగంగా దూషించినందుకు మ్యాచ్ ఫీజులో మరో 25శాతం కోత విధించింది ఐసీసీ. డీమెరిట్ పాయింట్స్ కారణంగా హర్మన్ ఒక టెస్ట్ మ్యాచ్ లేదా రెండు వన్డేలు, లేదా రెండు టీ20 మ్యాచ్ లకు దూరం కానుంది. ఈ క్రమంలో భారత మహిళల జట్టు తదుపరి టోర్నీ ఏషియన్ గేమ్సే. ఈ నేపథ్యంలో ఏషియన్ గేమ్స్ లో కీలక మ్యాచ్ లకు హర్మన్ దూరం కానుంది.






Tags:    

Similar News