వరల్డ్కప్ టికెట్ రిజిస్ట్రేషన్ షురూ.. ఈసారి లాటరీ పద్దతి ద్వారా.. ఇలా బుక్ చేసుకోండి
మరో 50 రోజుల్లో మొదలయ్యే వరల్డ్ కప్ కోసం భారత అభిమానులు ఎదురుచూస్తున్నారు. టికెట్లు బుక్ చేసుకోవడం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. వాళ్లకు ఐసీసీ శుభవార్త చెప్పింది. అయితే ఈ టికెట్లు కావాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవల్సి ఉంటుంది. మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి టికెట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలయింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరీ ఎక్కువగా ఉంటే.. లాటరీ పద్ధతిలో టికెట్లు కేటాయించనున్నారు. కాగా, రిజిస్ట్రేషన్ల అనంతరం టికెట్ సేల్స్ ఆగస్ట్ 25 నుంచి మొదలవుతాయి. టీమిండియా మ్యాచ్ ల టికెట్ల అమ్మకాలు మాత్రం ఆగస్ట్ 30 నుంచి మొదలవుతాయి.
అయితే టికెట్లు కావాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఐసీసీ సూచించింది.
www.cricketworldcup.com/registerలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నవారే టికెట్లను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది. భారత్ ఆడే మ్యాచులకు సంబంధించి టికెట్లు ఈనెల 25, 30, 31 అలాగే సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో బుక్ చేసుకోవచ్చు.
ICC started registration process for World Cup tickets
ICC, started registration,World Cup tickets, icc World Cup2023, ODI World Cup 2023 Tickets