ICC World Cup 2023: నేడు అఫ్ఘాన్‌తో తలపడనున్న భారత్..
వరల్డ్ కప్ 2023లో నేడు (బుధవారం , అక్టోబర్ 11) ఇండియా, ఆఫ్ఘనిస్థాన్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. విరాట్ కోహ్లి సొంతగడ్డ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ వరల్డ్ కప్ లో సౌతాఫ్రికా, శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ లో 700కుపైగా రన్స్ నమోదైన నేపథ్యంలో ఇండియా, ఆఫ్ఘన్ మ్యాచ్ పై కూడా ఆసక్తి నెలకొంది. తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన ఇండియా.. టోర్నీలో రెండో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. మరోవైపు బంగ్లాదేశ్ చేతుల్లో ఓడి ఒత్తిడిలో ఆఫ్ఘనిస్థాన్ సైతం.. ఈ మ్యాచ్ విజయంపై కన్నేసింది
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ స్టేడియంలో జరిగిన తొలి వరల్డ్ కప్ మ్యాచ్ లో సౌతాఫ్రికా, శ్రీలంక కలిపి 700కుపైగా రన్స్ చేశాయి. సౌతాఫ్రికా ఏకంగా 428 రన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక లోకల్ హీరో విరాట్ కోహ్లి సొంతగడ్డపై ఎలా ఆడతాడన్నది ఆసక్తికరంగా మారింది. చెన్నైలో మిస్సయిన సెంచరీని ఇక్కడ సాధిస్తాడన్న ఆశతో అభిమానులు ఉన్నారు. అఫ్ఘాన్‌తో జరగబోయే మ్యాచ్‌లో అయినా.. ఇషాన్, శ్రేయస్ అయ్యర్‌లు మంచి ఇన్నింగ్స్‌తో రాణించాలని టీమ్ఇండియా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ సైతం తొలి మ్యాచ్‌లో ఒక్క పరుగు కూడా పెవిలియన్ బాట పట్టాడు. ఈ మ్యాచ్ లో బ్యాట్ ఝళిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అఫ్ఘాన్.. చిన్న జట్టే అయినా మరీ తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. ముఖ్యంగా రషీద్ ఖాన్ సత్తా ఏంటో టీమ్ఇండియా ప్లేయర్లకు తెలిసిందే. ఇక బ్యాటింగ్‌లో గుర్బాజ్ ఎలాంటి రికార్డులు సాధిస్తున్నాడో తెలిసిందే. ఇబ్రహీం జాద్రాన్ ఇటీవల మంచి ఫామ్‌లో ఉన్నాడు. నబి లాంటి నాణ్యమైన ఆల్‌రౌండర్ సేవలూ అఫ్ఘాన్‌కు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి అఫ్ఘాన్‌తో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే.
ఇండియా, ఆఫ్ఘనిస్థాన్ వరల్డ్ కప్ మ్యాచ్ టీవీలో అయితే స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ లో చూడొచ్చు. ఇక ఈ మ్యాచ్ ను డిజిటల్ ప్లాట్ ఫామ్ పై అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లైవ్ స్ట్రీమింగ్ చేస్తోంది. మొబైల్ యాప్ లో ఈ మ్యాచ్ ను ఫ్రీగా చూసే వీలుంది.