AUS Vs SL: ఆస్ట్రేలియాతో పోరుకు రెడీ అయిన లంక.. బోణీ కొట్టేదెవరు?

Update: 2023-10-16 06:59 GMT

క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకూ ఐదుసార్లు ప్రపంచకప్‌ ట్రోఫిని చేజిక్కించుకున్న ఆస్ట్రేలియా.. ఈ మెగాటోర్నీలో ఇంతవరకు బోణీ కొట్టలేదు. మేటి ఆటగాళ్లున్నా.. పేలవ ఆటతీరుతో వెనుకబడింది. ఈ టోర్నీలో తొలి విజయం కోసం చూస్తున్న ఆ జట్టు.. సోమవారం శ్రీలంకపై గెలిచి ఖాతా తెరవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు మాజీ చాంపియన్‌ లంక కూడా ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడి.. ఈసారి మ్యాచ్ లో గెలుపు కోసం సన్నద్ధమవుతోంది. సోమవారం లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో ఈ ఇరుజట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా రెండు జట్లూ టోర్నీలో మొదటి విజయం సాధించాలని భావిస్తున్నాయి. ఆస్ట్రేలియా జట్టు తన తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత్, దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోగా, శ్రీలంక జట్టు తన తొలి రెండు మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌ల చేతిలో ఓడిపోయింది.

సెమీస్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలిచితీరాలి. బ్యాటింగ్‌, బౌలింగ్‌ రంగాల్లో పాట్‌కమిన్స్‌ బృందం వైఫల్యాలను ఎదుర్కొంటుండగా, ఛేజింగ్‌లో లంకేయుల బలహీనతలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో కీలక ఆటగాడు దాసన్‌ శనక గాయంతో వైదొలగడం శ్రీలకంకు ప్రతికూలంగా మారింది. ఈ స్థితిలో టాప్‌-4లో నిలిచేందుకు ఈ మ్యాచ్‌ ఫలితం ఇరుజట్లకు కీలకం కాబోతున్నది.

ఆస్ట్రేలియా తుదిజట్టు (అంచనా)

డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ (కెప్టెన్), ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్

శ్రీలంక తుదిజట్టు (అంచనా)

పతుం నిస్సాంక, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్ (కెప్టెన్, వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ్ డి సిల్వా, దునిత్ వెలలెజ్, చమిక కరుణరత్నే, మహిష్ తీక్షణ, కసున్ రజిత, దిల్షన్ మదుశంక

Tags:    

Similar News