Semis Scenario: ఇవాళ పాకిస్తాన్ ఓడితే.. 4 టీంలు ఇంటికే!

Byline :  Bharath
Update: 2023-11-04 03:13 GMT

భారత గడ్డపై జరుగుతున్న ప్రపంచ కప్ చివరికి ఆసక్తికరంగా మారింది. సెమీస్ సినారియో పూర్తిగా మారిపోయింది. ఏ జట్టు సెమీస్ కు అర్హత సాధిస్తుంది అన్నది ఆసక్తిరేకిస్తోంది. ప్రస్తుతం టీమిండియా సెమీస్ లో అడుగుపెట్టగా.. సౌతాఫ్రికా అవకాశాలు దాదాపు ఖరారు అయిపోయింది. మిగిలిన రెండు స్థానాల కోసం న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు పోటీ పడుతున్నాయి. దీంతో అంతా గందరగోళ పరిస్థితి ఉంది. చివరికి రన్ రేట్ ఆధారంగా జట్లు సెమీస్ కు అర్హత సాధిస్తాయని తెలుస్తుంది. ఎందుకంటే.. ఆసీస్, కివీస్, పాక్, ఆఫ్ఘన్ జట్లు దాదాపు ఒకే పొజిషన్ లో ఉన్నాయి. ఆసీస్ 6 మ్యాచుల్లో 4 విజయాలు, కివీస్, ఆఫ్ఘన్ 7 మ్యాచుల్లో 4 విజయాలను నమోదు చేశాయి. పాక్ మాత్రం 7 మ్యాచుల్లో మూడిట్లో మాత్రమే గెలుపొందింది.

దాంతో సెమీస్ అవకాశాలు పాక్ జట్టుకు సన్నగిల్లినా ఎక్కడో చిన్న ఆశ మాత్రం కనిపిస్తుంది. చివరి వరకు మిగతా జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంది. ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు కూడా చివరి వరకు ఆశలు పెట్టుకున్నాయి. మిగిలిన మూడు మ్యాచుల్లో గెలిచి చివరి వరకు రేసులో నిలవాలని చూస్తున్నాయి. అయితే ఇవాళ న్యూజిలాండ్ తో జరిగే పాక్ జట్టుతో పాటు మరో 4 జట్లకు కీలకంగా మారింది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ గెలిస్తే ఏకంగా 4 టీంలు సెమీస్ రేసు నుంచి నిష్క్రమిస్తాయి. ఈ మ్యాచ్ లో కివీస్ గెలిస్తే 10 పాయింట్లు లభిస్తాయి. కాగా, పాక్, శ్రీలంక, ఇంగ్లండ్, నెదర్లాండ్స్ జట్లు మిగిలిన అన్ని మ్యాచుల్లో గెలిచినా 10 పాయింట్లు సాధించలేవు కాబట్టి అవి లీగ్ స్టేజ్ నుంచి నిష్క్రమిస్తాయి. అప్పుడు ఆసీస్, ఆఫ్ఘన్ మాత్రమే సెమీస్ రేసులో నిలుస్తాయి. 

Tags:    

Similar News