ICC World Cup 2023 : సౌతాఫ్రికా vs ఆస్ట్రేలియా సెమీస్ ఫిక్స్.. భారత్తో ఆడేది ఎవరు?

Byline :  Bharath
Update: 2023-11-08 07:30 GMT

వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లు మరో 4 రోజుల్లో ముగుస్తాయి. ఇంకో 6 మ్యాచ్ లే మిగిలున్నాయి. ఇప్పటికే భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లు సెమీస్ లో అడుగుపెట్టాయి. మిగిలిన నాలుగో స్థానం కోసం న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ జట్లు పోటీపడుతున్నాయి. ఇప్పటికే సౌతాఫ్రికా, ఆసీస్ మధ్య సెమీస్ పోరు ఉంటుందని తేలిపోయింది. టీమిండియాతో ఏ జట్టు ఆడుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. పాయింట్స్ టేబుల్ లో టాప్ లో ఉన్న జట్టు నాలుగో స్థానంలో ఉన్న జట్టుతో సెమీస్ ఆడుతుంది. రెండో స్థానంలో ఉన్న జట్టు, మూడో స్థానంలో ఉన్న టీంతో ఆడుతుంది. ప్రస్తుతం సౌతాఫ్రికా, ఆసీస్ ల స్థానాలు రన్ రేట్ తేడాతో తారుమారు అవుతాయి. అయితే ఆ జట్లకు మిగిలిన మ్యాచ్ లో ఫలితం ఏదైనా.. రెండు మూడు స్థానాల్లోనే ఉంటాయి.

కాగా నాలుగో స్థానం కోసం ఇంకా పోటీ కొనసాగుతూనే ఉంది. భారత్ తో సెమీస్ ఆడేందుకు మూడు జట్లు ఇంకా పోటీ పడుతున్నాయి. ఆయా జట్లకు మిగిలిన ఒక మ్యాచ్ ను భారీ తేడాతో గెలిస్తేనే సెమీస్ లో చాన్స్ ఉంటుంది. రన్ రేట్ లో ఒక్క పాయింట్ తేడా జరిగినా టోర్నీ నుంచి వైదొలుగుతుంది. ప్రతీ జట్టు మరో జట్టు ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఎక్కువ చాన్స్ లు న్యూజిలాండ్, పాకిస్తాన్ లకే ఉన్నాయి. ఒకవేళ పాకిస్తాన్ సెమీస్ కు అర్హత సాధిస్తే.. మరోసారి దయాదుల పోరు ఈ వరల్డ్ కప్ లో చూసే అవకాశం జరుగుతుంది. నవంబర్ 15న వాంఖడే స్టేడియంలో టీమిండియా సెమీస్ మ్యాచ్ జరగనుంది.




Tags:    

Similar News