IND vs NZ Semi Final 2023: టాస్ గెలిచిన టీమిండియా.. ఫీల్డింగ్ ఎవరిదంటే..

Byline :  Veerendra Prasad
Update: 2023-11-15 08:12 GMT

ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు ఓటమి ఎరుగకుండా దూసుకుపోతున్న భారత్.. నేడు న్యూజిలాండ్ తో సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడుతోంది. ఇప్పటి వరకు జరిగిన మొత్తం 9 లీగ్ మ్యాచ్‍ల్లో గెలిచి సెమీస్‍కు సిద్ధమైంది భారత్. పాయింట్ల పట్టికలోనూ అగ్రస్థానాన్ని ఖరారు చేసుకుంది.సెమిస్ లోనూ గెలిచి అజేయంగా ఫైనల్ లో అడుగుపెట్టాలని రోహిత్ సేన భావిస్తోంది. గత వరల్డ్‌ కప్‌ సెమీస్‌లో ఓటమికి ఈసారి కివీస్‌పై భారత్‌ ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా మరికాసేపట్లో భారత్, కివీస్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

భారత తుది జట్టు: శుభ్‍మన్ గిల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, కుల్‍దీప్ యాదవ్, జస్‍ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్

న్యూజిలాండ్ తుది జట్టు:

న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్(సి), డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, టామ్ లాథమ్(w), మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్




Tags:    

Similar News