ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2023లో భారత- ఏ జట్టు అదరగొట్టింది. సెమీ ఫైనల్ లో బంగ్లాదేశ్-ఏ ను చిత్తు చేసి ఫైనల్స్ కు దూసుకెళ్లింది. 51 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 211 రన్స్ కు ఆలౌట్ అయింది. అనంతరం 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 160 పరుగులకు ఆలౌట్ అయింది. కేవలం 34.2 ఓవర్లలో బంగ్లాను కుప్ప కూల్చారు భారత కుర్రాళ్లు. భారత బౌలర్లలో నిశాంత్ 5, మనవ్ 3 వికెట్లు తీసుకున్నారు. అభిషేక్ శర్మ, యువరాజ్ సింగ్ దోడియాలకు చెరో వికెట్ దక్కింది. ఈ విజయంతో భారత్- ఏ ఫైనల్ కు చేరుకుంది. ఫైనల్స్ లో పాకిస్తాన్ తో తలపడనుంది.