భారత్-టీమిండియా మూడో టీ20కి వర్షం అంతరాయం కలిగిస్తోంది. మ్యాచ్ జరగాల్సిన ఉన్న ది విలేజ్ స్టేడియం పరిశర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మూడు గంటల నుంచి వాన పడుతుండడంతో మ్యాచ్ నిర్వహించడం సాధ్యం కావడం లేదు. కాసేపు అయ్యాక మరోసారి పరిస్థితిని అంపైర్లు పరీక్షించనున్నారు. వర్షం తగ్గితే ఓవర్ల కుదింపు ఉంటుంది. అప్పటికి తగ్గకపోతే మ్యాచ్‌ను రద్దు చేసే అవకాశం ఉంది. కనీసం ఐదు ఓవర్ల ఆట సాధ్యమైతేనే మ్యాచ్ నిర్వహిస్తారు. లేకుంటే రద్దు చేస్తారు. మ్యాచ్ రద్దైతే మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి రెండు మ్యాచ్‌లను గెలిచిన టీమిండియా 2-0తో సిరీస్ కైవసం చేసుకుంటుంది. మూడు టీ-20ల సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేయాలనుకున్న టీమ్ ఇండియా ఆశలకు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. మరోవైపు రిజర్వ్ ఆటగాళ్లను పరీక్షించేందుకు ఈ నామమాత్రమైన మ్యాచ్ టీమిండియా వాడుకోనుంది.