IND vs ENG : ముగిసిన రెండో రోజు ఆట..భారత్ ఆధిక్యం

Byline :  Vamshi
Update: 2024-02-16 12:22 GMT

ఇంగ్లండ్, టీమిండియా మధ్య రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 207/2 స్కోరుతో ఉంది. క్రీజ్‌లో బెన్ డకెట్ (133), జోరూట్ (9) ఉన్నారు. అశ్విన్, సిరాజ్ తలో ఒక వికెట్ తీశారు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 445 పరుగులకు ఆలౌట్ అయింది. మొదటి రోజు ఆటలో భారత్ పూర్తి ఆధిపత్యం కొనసాగింది. రెండో రోజు ఇంగ్లాండ్ బ్యాటర్లు తమ సత్తా చాటారు. భారత బ్యాటర్లు రోహిత్ 112, సర్ఫరాజ్ ఖాన్ 62, ద్రువ్ జురేల్ 46, అశ్విన్ 37, బూమ్ర 26 పరుగులతో రాణించారు. దీంతో రెండో రోజు భారత జట్టు 445 పరుగుల వద్ద ఆలౌట్ అయింది.

ఇక రెండోరోజు శుక్రవారం 326 ఓవర్నైట్ స్కోర్ వద్ద బ్యాటింగ్ మొదలు పెట్టిన భారత్ జట్టు జడేజా దూకుడుగా ఆడడంతో మంచి స్కోర్ సాధించింది. ఈ క్రమంలో జడేజా తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మొత్తం మీద ఓవర్ నైట్ స్కోర్ కు 119 పరుగులు జోడించిన భారత్ 445 పరుగుల వద్ద తన ఇన్నింగ్స్ ముగించింది. అనంతరం ఇంగ్లాండ్ బ్యాటర్లు నిలకడగా బ్యాటింగ్ చేస్తూ వస్తున్నారు. 13.1 ఓవర్లకు జాక్ 89 పరుగుల వద్ద అవుట్ కాగా.. ఓలి పొప్ 39 పరుగులకు అవుట్ అయ్యాడు. కాగా ఓపెనర్ బెన్ డక్కెట్ 133 * రూట్ 9 పరుగులుతో ఆడుతున్నారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు కేవలం రెండు వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. దీంతో మరో 238 పరుగులు వెనుకబడి ఉంది. భారత బౌలర్లలలో అశ్విన్, కుల్దీప్ యాదవ్‌లు చెరో వికెట్ తీసుకున్నారు. కాగా ఐదు టెస్టుల సిరీస్ 1-1 తో సమంగా కొనసాగుతుంది. ఈ మూడో టెస్టులో గెలిచిన వారికి లీడ్ దక్కే అవకాశం ఉంది.

Tags:    

Similar News