IND vs SL: వరుణుడు శాంతించాడు.. మ్యాచ్ మొదలయింది

Byline :  Bharath
Update: 2023-09-12 09:38 GMT

పాకిస్తాన్ తో గెలిచిన ఆనందం నుంచి తేరుకోక ముందే టీమిండియా మరో పోరుకు సిద్ధం అయింది. సూపర్ 4లో భాగంగా.. కొలంబో వేదికపై ఇవాళ శ్రీలంకతో తలపడనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కాగా ఆసియా కప్ లో శ్రీలంక రాణిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లతో ఆడి వరుస విజయాలు అందుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంకను సొంత గడ్డపై ఎదుర్కొవడం అంత సులువేం కాదు. అయితే నిన్నటి విజయంతో రెట్టింపు ఉత్సాహంతో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్ కూడా గెలిచి ఫైనల్ లో అడుగుపెట్టాలని చూస్తోంది.

తుది జట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (w), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

శ్రీలంక (ప్లేయింగ్ XI): పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్(w), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక(సి), దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, మతీషా పతిరనా

Tags:    

Similar News