IND vs SA: బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. ‘మాకు మేమే ఛాలెంజ్ ఇచ్చుకున్నం’
సెమీస్ ముందు జరగబోయే బడా గేమ్ లో టీమిండియా.. సౌతాఫ్రికాతో తలపడుతుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రోహిత్ సేన బ్యాటింగ్ ఎంచుకుంది. పోయిన మ్యాచులను బట్టి చూస్తే ఈ పిచ్ కాస్త డిఫరెంట్ గా కనిపిస్తుంది. కాగా తమను తాము చాలెంజ్ చేసుకునేందుకే బ్యాటింగ్ ఎంచుకున్నట్లు రోహిత్ శర్మ వివరించాడు. టీమిండియాకు టోర్నీలో ఇప్పటివరకు డిఫెండ్ చేసే అవకాశం తక్కువసార్లు వచ్చింది. అంతేకాకుండా సౌతాఫ్రికా చేజింగ్ అంతపెద్దగా రాణించలేదు. ఈ కారణంగా మొదట బ్యాటింగ్ చేసినట్లు తెలుస్తుంది.
తుది జట్లు:
దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(w), టెంబా బావుమా(సి), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, తబ్రైజ్ షమ్సీ, కగిసో రబడ, లుంగీ న్గిడి
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (w), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్