ఈరోజే వెస్టిండీస్ తో తొలి టెస్ట్ మ్యాచ్

Update: 2023-07-12 04:09 GMT

పెద్దవాళ్ళు అందరూ నెమ్మదిగా రిటైర్ అయిపోతున్నారు...కొత్త కుర్రాళ్ళు వస్తున్నారు. ఐపీఎల్ లో దుమ్ముదులిపిన లేత పోరగాళ్ళు ఇప్పుడు ఇండియా తరుఫున ఆడడానికి సిద్ధమవుతున్నారు. క్రికెట్ లో ఇండియాకు ఉన్న పేరును నిలబెట్టడానికి నడుం బిగిస్తున్నారు.

వెస్టిండీస్ తో సిరీస్...టెస్ట్, వన్డే, ట20 అన్నీ ఆడతారు. ఈరోనే దానికి ఆరంభం. ప్రస్తుతం వెస్టిండీస్ చాలా బలహీనంగా ఉంది. ఇండియా అప్పుడప్పుడూ తడబడుతున్నా నిలకడగానే ఆడుతోంది. దాంతో ఈ సీరీస్ మొత్తం భారత్ దే అనే అభిప్రాయం బలంగా ఉంది. చాలా మూమూలుగా ఆడినా కూడా ఇండియా గెలుస్తుందని చెబుతున్నారు. కానీ అందరి దృష్టీ టీమిండియా మీదే ఉంది. దానికి కారణం కొత్త కుర్రాళ్ళు, కొత్త రక్తం. రిటైర్ మెంట్ కు వచ్చేసిన సీనియర్లు ఒకవైపు...జట్టు బాధ్యతలు మావి అంటున్న యంగ్ జనరేషన్ మరొకవైపు. ఇప్పుడు ఈ సీరీస్ లో ఆకర్షణ అంతా వీళ్ళదే.

ఈరోజు మొదలయ్యే తొలి టెస్ట్ మ్యాచ్ లో సత్తా చాటేందుకు కుర్రాళ్ళు ఉత్సాహంగా ఉన్నారు. 2023-25 డబ్ల్యూటీసీ ఆరంభంలో భారత్ కు ఇదే తొలి మ్యాచ్ కూడా. అందుకే దీన్ని ప్రెస్టీజియస్ గా తీసుకుంటున్నారు. గెలుపుతో కొత్త ప్రయాణాన్ని ఆరంభించాలని అనుకుంటున్నారు.

వన్డేలు, టీ20ల్లో చెలరేగిపోతున్న శుభ్ మన్ గిల్ ఫస్ట్ టైమ్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడబోతున్నాడు. పుజారా స్థానంలో ఈసారి మూడో ప్లేస్ లో శుభ్ మన్ గిల్ ఆడనున్నాడు. అలాగే ఇషాన్ కిషన్ కూ ఇదే మొదటి టెస్ట్ మ్యాచ్. ఆంధ్ర ఆటగాడు కేఎస్ భరత్ కూడా టీమ్ లో ఉన్నాడు. అయితే అతణ్ణి ఆడిస్తారా లేదా అన్నది మాత్రం తెలియదు. ఇక ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ కోల్పోయిన రోహిత్ కు ఈ సీరీస్ ఒక సవాల్. కెప్టెన్ గా తనను తాను నిలబెట్టుకోవడానికి రోహిత్ ఈ సీస్ గెలిచి చూపించాల్సిందే. మరోవైపు రహానె కి కూడా ఇది క్రూషియల్.

ప్రస్తుతానికి బ్యాటింగ్ లైనప్ చాలా పటిష్టంగా ఉంది. కానీ బౌలింగ్ మాత్రం స్ట్రాంగ్ గా కనిపించడం లేదు. సిరాజ్, శార్దూల్, జైదేవ్ ఉన్కదత్, నవ్ దీప్ సైని, ముకేష్ కుమార్ లు పేసర్లు ఉన్నారు. అశ్విస్, జడేజాలు స్పిన్ బాధ్యతలు పంచుకుంటారు.

ప్రస్తుతానికి విండీస్ ఆట సరిగ్గా లేదు. చెత్త ఆటతో వన్డే వరల్డ్ కప్ కి కూడా అర్హత సాధింలేకపోయింది. టీ20లు బాగానే ఆడుతున్న వన్డే, టెస్ట్ ల్లో మాత్రం అస్సలు రాణించడం లేదు. అలాంటి టీమ్ ఈ టెస్ట్ ల్లో కష్టపడుతుందా. ఇప్పటికైనా క్రికెట్ లో అన్ని ఫార్మాట్లను సీరియస్ గా తీసుకుని ఆడుతుందా లేదా అనేది చూడాలి. టీమ్ లో ఆటగాళ్ళకు కొదవేం లేదు. బ్యాట్ మెన్, బౌలర్లు ఇద్దరూ స్ట్రాంగ్ గా ఉన్నారు.



Tags:    

Similar News