Cricket World Cup 2023 : కోహ్లీ సెంచరీ.. సౌతాఫ్రికాపై టీమిండియా భారీ స్కోర్
By : Mic Tv Desk
Update: 2023-11-05 12:49 GMT
సెమీస్కు ముందు సౌతాఫ్రికాతో జరుగుతున్న కీలక పోరులో టీమిండియా భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 50ఓవర్లలో 326 రన్స్ చేసింది. బర్త్ డే బాయ్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. 121 బాల్స్లో 101 రన్నులు చేసి టీమిండియా భారీ స్కోర్ చేయడంలో కీలకంగా నిలిచాడు. రోహిత్ 40, గిల్ 23 రన్స్ కే ఔటైనా.. కోహ్లీ శ్రేయస్ అయ్యర్ తో కలిసి కీలక పార్టనర్షిప్ నెలకొల్పాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్కు 134 రన్స్ జోడించారు. 77 రన్స్ అయ్యర్.. మార్క్రామ్కు క్యాచ్ ఔటవ్వగా.. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లతో కలిసి కోహీ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. చివర్లో వచ్చిన జడేజా 15బంతుల్లో 29 రన్స్ చేసి రాణించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, తబ్రైజ్ షమ్సీ, కగిసో రబడ, లుంగీ న్గిడి తలో వికెట్ తీశారు.