IND vs SL: అదరగొట్టిన టీమిండియా.. శ్రీలంక టార్గెట్ ఎంతంటే..?

By :  Kiran
Update: 2023-11-02 13:44 GMT

క్రికెట్ వరల్డ్ కప్‌లో టీమిండియా బ్యాటర్లు మరోసారి అదరగొట్టారు. ముంబై వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో భారీ స్కోర్ చేశారు. శ్రీలంకకు 358 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇచదచారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 8 వికెట్ల కోల్పయి 357 రన్స్ చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ (4) పరుగులకే ఔట్‌ కాగా.. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 92 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 92, విరాట్‌ కోహ్లీ 88 (94 బంతుల్లో 11 ఫోర్లు) రన్స్ చేశారు. రెండో వికెట్‌కు వీరిద్దరూ 189 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

విరాట్, శుభ్మన్ గిల్ ఇద్దరూ సెంచరీలకు చేరువలో పెవిలియన్ బాట పట్టారు. శ్రేయస్ అయ్యర్ 56 బాల్స్ లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లు కొట్టి 82 రన్స్తో భారీ ఇన్నింగ్స్‌ ఆడి టీమిండియా స్కోరు 300 దాటడంలో కీలక పాత్ర పోషించాడు. కేఎల్ రాహుల్ 21 (19 బంతుల్లో 2 ఫోర్లు), సూర్యకుమార్‌ యాదవ్‌ 12 (9 బంతుల్లో 2 ఫోర్లు) రన్స్ చేశాడు. 4 బంతులాడి 2 రన్స్ చేసిన షమీ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. లాస్ట్ బాల్కు రవీంద్ర జడేజా 34(23) రనౌట్‌గా వెనుదిరగగా, బూమ్రా 1(1) నాటౌట్‌గా నిలిచాడు. శ్రీలంక బౌలర్లలో మధుశంక 5, దుష్మంత చమీర ఒక వికెట్ తీశారు

Tags:    

Similar News