రేపటి నుంచి భారత్-సౌతాఫ్రికా సిరీస్.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?

Byline :  Bharath
Update: 2023-12-08 15:25 GMT

వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత స్వదేశంలో జరిగిన ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో టీమిండియా.. ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. 4-1తో సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇప్పుడు సౌతాఫ్రికా పర్యటనకు సిద్ధం అయింది. డిసెంబర్ 10నుంచి ప్రారంభం కానున్న ఈ టూర్ లో టీ20లు, వన్డేలు, టెస్ట్ మ్యాచ్ లు ఆడనున్నారు. ఈ సిరీస్ కు సంబంధించి ఇరు జట్లు జట్లను, షెడ్యూల్ ను ప్రకటించాయి. అయితే ఎందులో లైవ్ స్ట్రీమింగ్ జరుగుతుందనేది మాత్రం చాలామందిలో ఓ కన్ఫ్యూజన్ ఉండిపోయింది. దీనిపై ఐసీసీ క్లారిటీ ఇచ్చింది. స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ లో లైవ్ స్ట్రీమింగ్ జరగనుంది. డిస్నీ+ హాట్ స్టార్ లో ఆన్ లైన్ లో చూడొచ్చు. కాగా ఈ సిరీస్ కోసం కుర్రాళ్లంతా డిసెంబర్ 6నే సౌతాఫ్రికాలోని డర్బన్ చేరుకోగా.. పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి రెస్ట్ తీసుకున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ సిరీస్ కు జట్టులో చేరనున్నారు. భారత కాలమానం ప్రకారం టీ20 మ్యాచులు రాత్రి 9:30 గంటలకు జరుగుతాయి. తొలి వన్డే మధ్యాహ్నం 1:30 గంటలకు, చివరి రెండు వన్డేలు సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభమవుతాయి. ఇక టెస్ట్ మ్యాచ్ ల విషయానికి వస్తే.. తొలి టెస్ట్ మధ్యాహ్నం 1:30 గంటలకు, రెండో టెస్ట్ మధ్యాహ్నం 2:00 గంటలకు మొదలవుతాయి.

ఇండియా vs సౌతాఫ్రికా టీ20 సిరీస్

డిసెంబర్ 10: తొలి టీ20 (డర్బన్)

డిసెంబర్ 12: రెండో టీ20(గెబర్హా)

డిసెంబర్ 14: మూడో టీ20 (జోహన్‌బర్గ్‌)

ఇండియా vs సౌతాఫ్రికా వన్డే సిరీస్

డిసెంబర్ 17: మొదటి వన్డే (జోహన్‌బర్గ్‌)

డిసెంబర్ 19: రెండో వన్డే (గెబర్హా)

డిసెంబర్ 21: మూడో వన్డే (పర్ల్‌)

ఇండియా vs సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్

డిసెంబర్ 26 - 30: తొలి టెస్టు (సెంచూరియన్‌)

జనవరి 3 - 7: రెండో టెస్టు (కేప్‌టౌన్‌)

Tags:    

Similar News