వరల్డ్‌కప్ సెమీఫైనల్ బెర్త్‌లు అధికారికంగా ఖరారయ్యాయి. సెమీ ఫైనల్స్‌కు భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అర్హత సాధించాయి. ఇవాళ ఇంగ్లాండ్ జరిగిన మ్యాచ్లో పాక్ ఓడిపోవడంతో న్యూజిలాండ్ నాలుగో జట్టుగా సెమీస్‌కు చేరింది. సెమీ ఫెనల్లో భారత్.. న్యూజిలాండ్తో తలపడనుంది.
నవంబర్ 15న ముంబై వాంఖడే స్టేడియంలో భారత్ - న్యూజిలాండ్ మధ్య తొలి సెమీ ఫైనల్ జరగనుంది. నవంబర్ 16న కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో రెండో సెమీఫైనల్లో సౌతాఫ్రికా - ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. కాగా 2019 వరల్డ్‌కప్ సెమీఫైనల్లోనూ భారత్ - న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో టీమిండియా 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. అదే టోర్నీలో ఫైనల్కు చేరిన న్యూజిలాండ్.. ఇంగ్లాండ్పై అనూహ్య రీతిలో ఓడింది.