India Vs Australia : వర్షంతో నిలిచిన భారత్ - ఆసీస్ రెండో వన్డే..
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్ - ఆసీస్ మధ్య రెండో వన్డే జరుగుతోంది. ఇండోర్లో జరుగుతున్న ఈ మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించింది. టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుండగా.. 10వ ఓవర్లో వర్షం కురిసింది. దీంతో మ్యాచ్ను అంపైర్లు నిలిపేశారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 79/1గా ఉంది. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ లో గైక్వాడ్ ఔట్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ ఫస్ట్ నుంచే దూకుడుగా ఆడుతున్నాడు. గిల్ 32, శ్రేయస్ 34 పరుగులతో క్రీజులో ఉన్నారు.
అంతకుముందు ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్కు టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రా దూరంగా ఉన్నాడు. అతడి స్థానంలో ప్రసిద్ధ్ జట్టులోకి వచ్చాడు. అటు ఆసీస్ కూడా పలు మార్పులతో బరిలోకి దిగింది. ఆసీస్ కెప్టెన్గా స్టీవ్ స్మిత్ వ్యవహరిస్తున్నాడు. తొలి మ్యాచ్లో గెలిచిన టీమిండియా ఇవాళ కూడా ఆసీస్ను చిత్తు చేసి సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ సమం చేయాలని ఆసీస్ చూస్తోంది.
టీమిండియా : గిల్, గైక్వాడ్, శ్రేయస్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్, జడేజా, అశ్విన్, శార్దూల్ ఠాకూర్, షమీ, ప్రసిద్ధ్.
ఆసీస్ జట్టు : డేవిడ్ వార్నర్, మాథ్యూ షార్ట్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుస్చాగ్నే, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, సీన్ అబాట్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్, స్పెన్సర్ జాన్సన్