IND vs ENG 4th Test: టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌.. మ్యాచ్ ప్రారంభం

Byline :  Veerendra Prasad
Update: 2024-02-23 04:26 GMT

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా రాంఛీ వేదికగా భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య నాలుగో టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో పేసర్‌ ఆకాష్‌ దీప్‌ భారత తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. జస్ప్రీత్‌ బుమ్రా స్ధానంలో జట్టులోకి వచ్చాడు ఆకాష్‌ దీప్‌. మరోవైపు ఇంగ్లండ్‌ కూడా రెండు మార్పులతో బరిలోకి దిగింది. మార్క్‌ వుడ్‌ స్ధానంలో పేసర్‌ ఓలీ రాబిన్సన్‌ తుది జట్టులోకి రాగా.. రెహాన్‌ ఆహ్మద్‌ స్ధానంలో యువ స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌ రీ ఎంట్రీ ఇచ్చాడు. కాగా ఈ సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భారత జట్టు పట్టుదలతో ఉంది.

తుది జట్లు

భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్‌), శుభమన్ గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్(వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్

ఇంగ్లండ్ : జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్‌), బెన్ ఫోక్స్(వికెట్‌ కీపర్‌), టామ్ హార్ట్లీ, ఆలీ రాబిన్సన్, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్

Tags:    

Similar News