Yashasvi Jaiswal : మరో సూపర్ సెంచరీ చేసిన జైశ్వాల్.. సర్ఫరాజ్ అర్థ శతకం

Byline :  Veerendra Prasad
Update: 2024-02-18 07:47 GMT

టీమిండియా యంగ్ సెన్సేషన్ యశస్వి జైశ్వాల్.. తన అద్భుతమైన ఆట తీరుతో డబుల్ సెంచరీని సాధించాడు. ఇంగ్లండ్‍తో స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్‍లో విజృంభిస్తున్నాడు. రెండో టెస్టులో డబుల్ సెంచరీతో దుమ్మురేపిన యశస్వి.. ప్రస్తుతం జరుగుతున్న మూడో మ్యాచ్‍లోనూ డబుల్ సెంచరీలతో చెలరేగి ఆడాడు. ఇంగ్లండ్‍తో రాజ్‍కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో నాలుగో రోజు టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ బాదాడు యశస్వి జైస్వాల్. మొత్తానికి 231బంతుల్లో డబుల్ సెంచరీ(200*) సాధించాడు. టెస్టుల్లో అతనికిది నాలుగో శతకం. సొంత గడ్డపై ఒక సిరీస్‌లో 500+ రన్స్‌ చేసిన రెండో భారత బ్యాటర్‌ జైస్వాల్ గా నిలిచాడు. 534 పరుగులతో మొదటి స్థానంలో గంగూలీ ఉన్నాడు. ఒక సిరీస్‌లో భారత్‌ తరఫున అత్యధిక సిక్స్‌లు (20) కొట్టిన ఆటగాడిగానూ జైస్వాల్‌ నిలిచాడు.





 


ప్రస్తుతం భారత్‌ 4 వికెట్‌ల నష్టానికి 400 పరుగులతో కొనసాగుతోంది. జైస్వాల్‌తో పాటు సర్ఫరాజ్ ఖాన్(50) క్రీజ్‌లో ఉన్నాడు. జైస్వాల్ డబుల్ సెంచరీతో ఆకట్టుకోగా.. సర్ఫ్‌రాజ్ ఖాన్ హాఫ్ సెంచరీ చేశాడు. అంతకుముందు మరో యువ ఆటగాడు శుభ్ మన్ గిల్ (91).. టామ్ హ‌ర్ట్లే బౌలింగ్‌లో అనూహ్యంగా ర‌నౌట‌య్యాడు. ప్రస్తుతం టీమ్‌ఇండియా 500 పరుగుల ఆధిక్యంలో ఉంది.




 


కాగా నిన్నటి మ్యాచ్ లో చేసిన సెంచరీతోనే జైస్వాల్‌ అరుదైన ఘ‌న‌త‌ను సాధించాడు. టీమ్ఇండియా త‌రుపున టెస్టు క్రికెట్‌లో అతి త‌క్కువ ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచ‌రీలు చేసిన ఆట‌గాళ్ల జాబితాలో చోటు సంపాదించాడు. ఈ క్ర‌మంలో వీరేంద్ర సెహ్వాగ్, సంజయ్ మంజ్రేకర్‌ల రికార్డులను సమం చేశాడు. వీరేంద్ర సెహ్వాగ్, సంజయ్ మంజ్రేకర్ లు 13 టెస్ట్ ఇన్నింగ్స్‌లలో మూడు సెంచ‌రీలు చేశారు. జైస్వాల్ కూడా 13 ఇన్నింగ్స్‌ల్లో నే మూడు సెంచ‌రీలు బాదాడు. ఆ స‌మ‌యంలో సెహ్వాగ్ సగటు 53.31 కాగా, యశస్వి సగటు 62.25 గా ఉండ‌డం గ‌మ‌నార్హం.



 


Tags:    

Similar News