IND vs AUS : మొహాలీలో టీమిండియా ఘన విజయం.. 5 వికెట్ల తేడాతో గెలుపు

By :  Kiran
Update: 2023-09-22 16:34 GMT

మొహాలీ వేదికగా జరిగిన భారత్ - ఆస్ట్రేలియా తొలి వన్డే మ్యాచ్లో ఇండియా విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో ఆసీస్పై గెలుపొందింది. హాఫ్ సెంచరీ పూర్తి చేసిన కెప్టెన్ కేఎల్ రాహుల్ అద్బుతమైన షాట్లతో భారత్ ను విజేతగా నిలిపాడు. సీన్ అబాట్ వేసిన 49వ ఓవర్లో వరుసగా ఫోర్, సిక్స్ బాదాడు. దీంతో 8 బాల్స్ మిగిలి ఉండగానే భారత్ ఐదు వికెట్ల తేడాతో తొలి వన్జేలో విజేతగా నిలిచింది.

రుతురాజ్ గైక్వాడ్ (71), శుభ్ మన్ గిల్ 74, శ్రేయస్ అయ్యర్ 3, ఇషాన్ కిషన్ 18, కేఎల్ రాహుల్ 58 (నాటౌట్),రవీంద్ర జడేజా 3( నాటౌట్) రన్స్ చేశారు. హాఫ్ సెంచరీ చేసిన సూర్యకుమార్‌ పెవిలియన్‌కు చేరాడు. ఆసీస్ పై ఈ ఏడాది ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడింటిలో డకౌట్ అయిన సూర్యకు ఇదే హాఫ్ సెంచరీ కావడం విశేషం.

అంతకు ముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 276 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో డేవిడ్ వార్నర్ (52) హాఫ్ సెంచరీ సాధించగా.. మిచెల్‌ మార్ష్‌ (4), స్టీవ్‌ స్మిత్‌ (41), మార్నస్‌ లబూషేన్‌ (39), కెమరూన్‌ గ్రీన్‌ (31), ఇంగ్లిస్‌ (45), స్టోయినిస్‌ (29) స్కోర్ చేశారు. మ్యాచ్ ఆఖరిలో కమిన్స్‌ (21 నాటౌట్‌) వేగంగా పరుగులు చేశాడు. టీమిండియా ఏస్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ (5/51) ఐదు వికెట్లతో రెచ్చిపోయాడు. మిగిలిన బౌలర్లలో బుమ్రా, అశ్విన్‌, జడేజాలకు తలో వికెట్‌ దక్కాయి.

ఆఖరి ఓవర్లలో భారత బౌలర్లు పుంజుకున్నారు. షమీ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీశాడు. షమీ వేసిన 48.2వ ఓవర్‌ బంతిని భారీ షాట్ కొట్టే యత్నంలో షార్ట్ (2) సూర్య చేతికి చిక్కాడు. అదే ఓవర్‌ నాలుగో బాల్కు సీన్ అబాట్ (0)ను షమీ క్లీన్‌ బౌల్డ్ చేశాడు. షమీ 10 ఓవర్లలో 51 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీయగా, బుమ్రా (1/43), అశ్విన్ (1/47), జడేజా (1/51) కట్టుదిట్టమైన బౌలింగ్‌ వేశారు. శార్దూల్ ఠాకూర్ 10 ఓవర్లలో ఒక్క వికెట్‌ కూడా తీయకుండా 78 పరుగులు సమర్పించాడు.

Tags:    

Similar News