IND vs SA : తగ్గేదేలే.. సౌతాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా..

By :  Krishna
Update: 2023-11-05 15:21 GMT

ప్రపంచకప్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారత్ సూపర్ విక్టరీ కొట్టింది. 243 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. 327 లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలు టీమిండియా బౌలర్ల దెబ్బకు 83 రన్స్కే ఆలౌట్ అయ్యారు. సౌతాఫ్రికా బ్యాట్స్మెన్లలో ఒక్కరు కూడా 15రన్స్ దాటలేదు. మార్కో జాన్సెన్ 14 రన్స్ చేయగా.. ఏడుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్కే ఔట్ అయ్యారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 5 వికెట్లు పడగొట్టగా.. మహ్మద్‌ షమీ 2, కుల్దీప్ యాదవ్ 2, సిరాజ్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50ఓవర్లలో 326 రన్స్ చేసింది. బర్త్ డే బాయ్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. 121 బాల్స్లో 101 రన్నులు చేసి టీమిండియా భారీ స్కోర్ చేయడంలో కీలకంగా నిలిచాడు. రోహిత్ 40, గిల్ 23 రన్స్కే ఔటైనా.. కోహ్లీ శ్రేయస్ అయ్యర్తో కలిసి కీలక పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్కు 134 రన్స్ జోడించారు. 77 రన్స్ అయ్యర్.. మార్క్రామ్కు క్యాచ్ ఔటవ్వగా.. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లతో కలిసి కోహీ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. చివర్లో వచ్చిన జడేజా 15బంతుల్లో 29 రన్స్ చేసి రాణించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, తబ్రైజ్ షమ్సీ, కగిసో రబడ, లుంగీ న్గిడి తలో వికెట్ తీశారు. 

Tags:    

Similar News