IND vs SL: 6 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఫైనల్లో భారత్ ఘన విజయం

Byline :  Bharath
Update: 2023-09-17 12:39 GMT

ఫైనల్ మ్యాచ్ అయిపోయింది. భారత్ ఘన విజయం సాధించింది. వర్షం పడి, మ్యాచ్ రద్దవుతుందేమో అన్న ఉత్కంఠ తప్ప.. మ్యాచ్ అసలు ఫైనల్ లానే అనిపించలేదు. అయితేనేం.. 6 ఏళ్ల నిరీక్షణకు తెర దించుతూ భారత్ ఆసియా కప్ 2023 ట్రోఫీని ఎగరేసుకుపోయింది. వరల్డ్ కప్ కు ముందు కానిఫిడెన్స్ ఇచ్చే విజయంతో ముందుకు వెళ్లింది. టోర్నీ మొత్తం బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించిన టీమిండియా ఫైనల్ మ్యాచ్ లో సత్తా చాటింది. భారత బౌలర్ల దూకుడుకు తల వంచింది. సిరాజ్ మ్యాజిల్ స్పెల్ తో 6/21 వికెట్లు కెరీర్ లో అత్యుత్తమ ఘనాంకాలు నమోదు చేశాడు. హార్దిక్ పాండ్యా 3 వికెట్లతో రాణించాడు. బుమ్రా 1 వికెట్ తో లంక పతనానికి పునాది వేశాడు. దీంతో 15 ఓవర్లలో శ్రీలంక 50 పరుగులకు ఆలౌట్ అయింది. 51 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ సులుగా లక్ష్యాన్ని చేదించింది. 8వ ఆసియా కప్ ట్రోఫీని ఎగరేసుకుపోయింది. చేదనలో ఏ మాత్రం తడబడని టీమిండియా బ్యాటర్లు ఇషాన్ కిషన్ (23, 18 బంతుల్లో), శుభ్ మన్ గిల్ (27, 19 బంతుల్లో) ఈజీగా విజయాన్ని అందించారు. దీంతో 10 వికెట్ల తేడాతో భారత్ విజయభేరి మోగించింది.



Tags:    

Similar News