IND vs ENG : ఇంగ్లాండ్తో రెండో టెస్ట్.. టాస్ గెలిచిన భారత్..

Byline :  Krishna
Update: 2024-02-02 04:10 GMT

విశాఖ వేదికగా టీమిండియా - ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్ట్ జరుగుతోంది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఇంగ్లాండ్ ఫస్ట్ బౌలింగ్ చేయనుంది. 5 టెస్టుల సిరీస్లో ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్లో గెలిచి దానిని సమం చేయాలని టీమిండియా పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో జట్టులో పలు మార్పులు చేసింది. గాయంతో కేఎల్ రాహుల్, జడేజా దూరమవ్వగా.. సిరాజ్కు విశ్రాంతినిచ్చారు. వారి స్థానంలో ముఖేష్, కుల్దీప్ యాదవ్, రజత్ పటిదార్ తుదిజట్టులోకి వచ్చారు.

అటు ఇంగ్లాండ్ కూడా జట్టులో రెండు మార్పులు చేసింది. జాక్ లీచ్, మార్క్ వుడ్ స్థానంలో షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్లను జట్టులోకి తీసుకుంది. ఉప్పల్ టెస్టులో మొదట ఆధిపత్యం ప్రదర్శించిన రోహిత్ సేన.. చివరకు చేతులెత్తేసింది. బజ్ బాల్తో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో సత్తా చాటింది. ఈ మ్యాచ్లోనూ సత్తా చాటి సిరీస్పై పట్టు సాధించాలని ఇంగ్లీష్ జట్టు ప్రణాళికలు వేస్తోంది. భారత్ విశాఖలో విజృంభిస్తుందా.. బజ్ బాల్కు చెక్ పెడుతుందా.. ఉప్పల్ టెస్టుకు ప్రతీకారం తీర్చుకుంటుందా అన్నది చూడాలి.

టీమిండియా (అంచనా) : యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(సి), శుభమన్ గిల్, రజత్ పాటిదార్, శ్రేయాస్ అయ్యర్, శ్రీకర్ భరత్(w), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ముఖేష్ కుమార్

ఇంగ్లాండ్ ( అంచనా ) : జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(సి), బెన్ ఫోక్స్(w), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్

Tags:    

Similar News