టాస్ గెలిచిన భారత్.. ఆస్ట్రేలియా బ్యాటింగ్..

By :  Krishna
Update: 2023-09-22 08:19 GMT

వన్డే ప్రపంచకప్‌ ముందు టీమిండియా అసలైన పోరుకు సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇవాళ ఆస్ట్రేలియాతో తొలి వన్డే ఆడుతోంది. మొహాలిలో జరుగుతోన్న ఈ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్కు దిగనుంది. మొహాలీలో ఛేజింగ్ జట్లే ఎక్కువగా గెలవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కెప్టెన్ కేఎల్ రాహుల్ తెలిపారు.

ఇక గాయం కారణంగా ఆసియా కప్‌కు దూరమైన శ్రేయస్‌ అయ్యర్‌ తుది జట్టులోకి వచ్చాడు. ఏడాదిన్నర తర్వాత వన్డే జట్టుకు ఎంపికైన రవిచంద్రన్‌ అశ్విన్‌ కూడా తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. కాగా ఈ మ్యాచ్లో సీనియర్లకు రెస్ట్ ఇచ్చారు. రోహిత్, కోహ్లీ, హర్దిక్ పాండ్యాలు ఈ మ్యాచ్కు దూరంగా ఉన్నారు. మరోవైపు.. సౌతాఫ్రికా పర్యటనలో వన్డే సిరీస్‌ను కోల్పోయిన కంగారూలు భారత గడ్డపై సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్లో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.

భారత జట్టు: గిల్‌, గైక్వాడ్‌, శ్రేయస్‌, కేఎల్‌ రాహుల్‌(కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌, జడేజా, అశ్విన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, బుమ్రా, షమీ.

ఆస్ట్రేలియా జట్టు : వార్నర్‌, మార్ష్‌, స్మిత్‌, లబూషేన్‌, గ్రీన్‌, జోష్‌ ఇంగ్లిస్‌, స్టోయినిస్‌, షార్ట్‌, పాట్‌ కమిన్స్‌(కెప్టెన్‌), సీన్‌ అబాట్‌, ఆడం జంపా


Tags:    

Similar News