Mary Kom : రిటైర్మెంట్లో ట్విస్ట్.. అలా చెప్పలేదన్న మేరి కోమ్

Byline :  Krishna
Update: 2024-01-25 04:41 GMT

మేరీ కోమ్ రిటైర్మెంట్లో ట్విస్ట్ నెలకొంది. తాను రిటైర్మెంట్ ప్రకటించలేదని బాక్సింగ్ లెజెండ్ స్పష్టం చేసింది. మీడియాలో వస్తున్న కథనాలన్నీ అసత్యాలు అని చెప్పింది. ‘‘నేను ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదు. ఒకవేళ నేను రిటైర్ అవ్వాలనుకుంటే వ్యక్తిగతంగా మీడియా ముందుకు వచ్చి చెప్తాను. మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నేను ఒక స్కూల్ ఈవెంట్లో మాట్లాడిన మాటలను మరోలా అర్ధం చేసుకున్నారు. రిటైర్ అయినప్పుడు అందరికీ చెప్తాను ’’ మేరీ కోమ్ వివరించింది.

కాగా మేరీ కోమ్ 6 సార్లు వరల్డ్ ఛాంపియన్, 5 సార్లు ఆసియా ఛాంపియన్, ఒలంపిక్ పతక విజేత. పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్, రాజీవ్ ఖేల్ రత్న వంటి ఎన్నో పురస్కాలు అందుకున్న బాక్సింగ్ లెజెండ్. పురుషులు కూడా సాధించలేని ఎన్నో రికార్డులు మేరీ కోమ్ సొంతం. అయితే ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ రూల్స్ ప్రకారం 40ఏళ్లు దాటిన క్రీడాకారులు ప్రొఫెషనల్ బాక్సింగ్లో పాల్గొనవద్దు. ప్రస్తుతం మేరీ కోమ్ వయస్సు 41. ఈ నేపథ్యంలో ఆమె ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.

18 ఏళ్ల వయసులో పెన్సిల్వేనియాలో జరిగిన బాక్సింగ్‌ పోటీల్లో అంతర్జాతీయ ప్రవేశం చేసిన ఈ మణిపుర్‌ స్టార్‌.. ఎన్నో పతకాలను కొల్లగొట్టారు. బాక్సింగ్ లో ప్రపంచ ఛాంపియన్ గా నిలిచి.. తొలిసారి బంగారు పతకం సాధించిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. 2002, 2005, 2006, 2008, 2010, 2018లో జరిగిన పోటీల్లో వరల్డ్ ఛాంపియన్గా నిలిచింది. 2012 ఒలంపిక్స్లో కాంస్య పతకం సాధించింది. 2022లో కామన్వెల్త్ క్రీడల సెలక్షన్స్ ట్రయల్ సందర్భంగా గాయపడిన ఆమె.. అప్పటి నుంచి బాక్సింగ్ రింగ్కు దూరంగా ఉంది.

Tags:    

Similar News