నాజూగ్గా రోహిత్ శర్మ... ఏంటి ఇంత సన్నబడ్డాడు..!

Update: 2023-07-11 11:42 GMT

రోహిత్ శర్మ మంచి బ్యాటర్, మంచి కెప్టెన్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం ఫామ్ లేక ఇబ్బంది పడుతున్నా...గతంలో పరుగుల వరద పారించే వాడు. కాని రోహిత్‌ను వేధిస్తున్న సమస్య ఫిట్‌‌నెస్. బొద్దుగా ఉండే రోహిత్.. ఇందుకు ముందులాగా మైదానంలో చురుకుగా కదలడం లేదు. ఫీల్డింగ్‎లో బంతి వెనుక పరుగెత్తడంలో తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. అంతేకాకుండా వికెట్ల మధ్య పరిగెత్తే వేగం కూడా తగ్గింది. దీంతో హిట్ మ్యాన్‌పై తరచూ విమర్శలు వస్తునే ఉన్నాయి. 36 ఏళ్ల వయుస్సులో అతడి ఫిట్ నెస్‌ను మాజీలతో పాటు, క్రికెట్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.అయితే వెస్టిండీస్ టూర్‌కు రోహిత్ శర్మ తన ఫిట్‌నెస్ పై దృష్టిసారించినట్లు కనిపిస్తోంది. ఎట్టకేలకు ఫిట్‌గా మరియు సన్నగా కనిపిస్తున్నాడు. మైదానంలో చురుగ్గా కదిలేందుకు రోహిత్ బరువు తగ్గినట్లు తెలుస్తోంది. ఇందుకోసం రోహిత్ చాలా శ్రమించినట్లు సమాచారం.

కొత్త జెర్సీలో సన్నబడిన రోహిత్ ఫోటోలు చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. రోహిత్ లుక్ సూపర్ గా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. అతడు మనుపటి ఫామ్‌ను ఆందుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.వెస్టిండీస్‌ పర్యటనలో భాగంగా రేపు(జూలై12) మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది. డొమినికా వేదికగా వెస్టిండీస్-భారత్ తలపడనున్నాయి. ఈ టూర్ లో టీమిండియా మొత్తం రెండు టెస్ట్‌లు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది.


Tags:    

Similar News