Ayodhya : అయోధ్య రామమందిర కార్యక్రమంలో పాల్గొన్న క్రీడాకారులు

Byline :  Bharath
Update: 2024-01-22 09:58 GMT

అయోధ్యలో దివ్యమైన రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సోమవారం (జనవరి 22) మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకన్లకు అభిజీత్ ముహూర్తంలో 84 సెకన్లకు ఈ మహత్తర ఘట్టం ఆవిష్కృతమైంది. వేదమంత్రోచ్చారణ మధ్య రామ్‌లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించారు. ఎడమ చేతిలో విల్లు, కుడి చేతిలో బాణం, స్వర్ణాభరణాలతో భక్తులకు దర్శనమిచ్చాడు బాలరాముడు. చిరు దరహాసం, ప్రసన్న వదనంతో ఉన్న ఆ చిన్ని రాముడి దర్శనంతో భారతావని పులకించిపోయింది. టీవీల్లో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ చూసి అశేష భక్తకోటి తన్మయత్వం చెందింది. ఈ క్రమంలో రామజన్మ భూమి తీర్థ క్ష్రేత్ర ట్రస్ట్ దేశంలోని ప్రముఖులందరికీ ఆహ్వానం అందించిన విషయం తెలిసిందే.

కాగా ఇప్పటికే క్రీడా ప్రముఖులు రామ్ లల్లాను దర్శించుకున్నారు. ఆ లిస్ట్ లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, మితాలీ రాజ్, అనిల్ కుంబ్లే, రవీంద్ర జడేజా, సైనా నెహ్వాల్ కార్యక్రమంలో ఇప్పటికే పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిని స్పోర్ట్స్ స్టార్స్.. ‘‘ఇది చారిత్రాత్మక ఘట్టం. ప్రాణప్రతిష్టకు హాజరైనందుకు సంతోషంగా ఉంది. ఈ అవకాశం దక్కడం మా అదృష్టం’’అని జడేజా అన్నాడు. ‘‘ఎన్నో ఏళ్ల కల సాకారం అయినందుకు సంతోషంగా ఉంది. నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు’’ అని మితాలీ రాజ్ చెప్పుకొచ్చారు. ‘‘ఇదొక అద్భుతమైన సందర్భం. ఇందులో భాగమైనందుకు ఆనందంగా ఉంది. రామ్ లల్లా ఆశీర్వాదం కోసం ఎదురుచూస్తున్నాం’’అని అనిల్ కుంబ్లే అన్నాడు.









 


Tags:    

Similar News