చరిత్ర సృష్టించిన సాత్విక్‌-చిరాగ్‌ జోడీ..ఇండోనేసియా ఓపెన్‌ టైటిల్‌ కైవసం

Update: 2023-06-18 11:01 GMT

భారత బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌- చిరాగ్‌ శెట్టి చరిత్ర సృష్టించింది. ఇండోనేసియా ఓపెన్‌ టైటిల్‌‌ను కైవసం చేసుకుంది. ఫైనల్లో అరొన్‌ చియా-సో వుయిక్‌ (మలేసియా) జోడీకి షాక్ ఇస్తూ.. వరుస సెట్లలో 21-17, 21-18 మ్యాచ్‌ను నెగ్గారు. తద్వారా ఇండోనేసియా ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 1000 టోర్నీలో టైటిల్‌ నెగ్గిన తొలి భారత జోడీగా సాత్విక్‌-చిరాగ్‌ నిలిచారు.

టోర్నీ ఆరంభం నుంచే దుమ్మురేపుతున్న సాత్విక్ – చిరాగ్ జోడీ శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో టాప్‌ సీడ్‌ ఫజర్‌ అల్ఫియాన్‌- మహమ్మద్‌ రియాన్‌ (ఇండోనేసియా)పై విజయం సాధించి సంచలనం సృష్టించింది. సెమీస్‌లో దక్షిణ కొరియా జోడీ కాంగ్‌ మిన్‌ హిక్‌–సియో సెంగ్‌ జె పై 17-21 21-19 21-18 తేడాతో విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. టైటిల్ పోరులోనూ సాత్విక్ – చిరాగ్ జోడీ అదరగొట్టింది. ప్రత్యర్థులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను వరుస సెట్లలో ముగించి స్వర్ణం దక్కించుకుంది.ప్రస్తుత సీజన్‌లో సాత్విక్‌–చిరాగ్‌ జోడి స్విస్‌ ఓపెన్, ఆసియా చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి స్వర్ణ పతకాలు సాధించగా... మలేసియా ఓపెన్‌లో సెమీఫైనల్‌ చేరారు. తాజాగా ఇండోనేసియా ఓపెన్‌ టైటిల్‌‌ను కొల్లగొట్టారు.



Tags:    

Similar News