IPL 2024: ఐపీఎల్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. తేదీ ప్రకటించిన బీసీసీఐ.. ఈసారి దుబాయ్లో కాదు..!

By :  Bharath
Update: 2024-02-20 13:17 GMT

భారత్ లో వరల్డ్ కప్ కంటే.. ఐపీఎల్ కే విపరీతమైన క్రేజ్. అప్పటివరకు కలిసున్నవాళ్లే.. తమ ఫేవరెట్ జట్టుకోసం కొట్టుకుంటారు. నా టీం గొప్ప.. మావాడు గొప్ప అని ట్రోల్ చేసుకుంటారు. ఐపీఎల్ ఉన్న రెండు నెలలు పండగ లాంటి వాతావరణం ఉంటుంది. ఆ కిక్ కోసం ఏడాదంతా వెయిట్ చేస్తారు క్రికెట్ అభిమానులు. ఖర్చు ఎంతైనా సరే లెక్క చేయకుండా.. టికెట్లు కొంటుంటారు. అయితే దేశంలో ఈసారి సార్వత్రిక ఎన్నికల జరగనున్న నేపథ్యంలో.. ఐపీఎల్ 2024 ను దుబాయ్ లో నిర్వహిస్తారనే వార్తలు వచ్చాయి. అదే నిజం అన్నట్లు మినీ వేలం కూడా దుబాయ్ లోనే ఏర్పాటుచేశారు. అయితే ఈ వార్తను కొట్టిపారేసిన బీసీసీఐ.. భారత్ లోనే ఐపీఎల్ ను నిర్వహిస్తునట్లు క్లారిటీ ఇచ్చింది. తాజాగా మరో వార్తను అభిమానులతో పంచుకుంది.

మార్చి 22 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్నట్లు తెలిపింది. చెన్నై చిదంబరం స్టేడియంలో తొలి మ్యాచ్ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధమాల్ మీడియాతో పంచుకున్నారు. ఏప్రిల్, మే నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉన్న కారణంగా పూర్తి షెడ్యూల్ విడుదల చేసేందుకు టైం పడుతుందని అతను చెప్పుకొచ్చాడు. ఒకవేళ ఎన్నికల వల్ల మ్యాచ్ ల నిర్వహణకు ఆయా రాష్ట్రాలు సముకత చూపకపోతే.. వేరే వేదికలు ఆ మ్యాచ్ ను తరలిస్తారు. జూన్ 1 నుంచి వెస్టిండీస్, అమెరికా సంయుక్త వేదికలపై టీ20 వరల్డ్ కప్ జరగనుంది. దీంతో మే 20 లోపే ఐపీఎల్ 2024ను ముగిస్తారు.


Tags:    

Similar News