టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా ఇంతకాలం అయినా.. అతని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఐపీఎల్ ద్వారా ఇప్పటికీ తన అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. ధోనీ కెరీర్ లో ఎన్నో మ్యాచుల్లో గెలిచాడు. భారత్ కు టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రీఫీ అందించాడు. అయితే 41 ఏళ్ల ధోనీ ఇంకా ఐపీఎల్ లో కొనసాగాలని అభిమానులు కోరుతున్నారు. గత ఐపీఎల్ సీజన్ లో ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవట్లేదని, వచ్చే సీజన్ లో ఆడతానని ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. అనుకున్నట్లు గానే.. ఐపీఎల్ 2024 కోసం సన్నద్ధం అవుతున్నాడు. ఈ మధ్యే నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు బయటకు రావడంతో అవి కాస్త వైరలయ్యాయి. కానీ ధోనీకిదే చివరి ఐపీఎల్ అని ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో.. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు.
‘నేను ఇటీవలే ధోనీని కలిశా. పొట్టి జుట్టు పెంచుతూ బలే ఉన్నాడు. తన కెరీర్ తొలినాళ్లలో ఉన్న ధోనీలా తయారవుతున్నాడు. 40 ఏళ్లు దాటినా పూర్తి ఫిట్ నెస్ తో ఉన్నాడు. ఫ్రాంచైజీ కోసం, తన అభిమానుల కోసం ఇంకొన్నేళ్లు క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఆరోసారి ఐపీఎల్ కప్పును కొట్టేందుకు రెడీ అయ్యాడ’ని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు.