విరాట్ కోహ్లీని టీజ్ చేసిన ఇషాన్ కిషన్.. స్టంప్ మైక్లో రికార్డ్ కాకపోయుంటే..?
విరాట్ కోహ్లీ టీంలో ఉంటే ఆటగాళ్లలో జోష్ మామూలుగా ఉండదు. డ్రెస్సింగ్ రూం, ఔట్ ఫీల్డ్ అనే తేడా లేకుండా నవ్వుతూ, అందరినీ నవ్విస్తుంటాడు. గేమ్ లో ప్లేయర్లను, అంపైర్లను ఇమిటేట్ చేస్తూ నవ్వులు పూయిస్తాడు. ఇలా అందరినీ ఆటపట్టించే విరాట్ కోహ్లీని ఈసారి ఇషాన్ కిషన్ ఆడుకున్నాడు. ఆ వాయిస్ స్టంప్ మైక్ లో రికార్డ్ అవ్వడంతో ఓ వ్యక్తి వీడియో కట్ చేసి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వెస్టిండీస్ గడ్డపై జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్.. 150 పరుగులకే విండీస్ ను ఆలౌట్ చేసింది. అశ్విన్ 5 వికెట్లు, జడేజా 3 వికెట్లు తీసి విండీస్ ను కుప్ప కూల్చారు. ప్రస్తుతం కెప్టెన్ రోహిత్ శర్మ (30), యంగ్ స్టర్ యశస్వీ జైశ్వాల్ (40) క్రీజ్ లో ఉన్నారు. ఈ క్రమంలో మొదటి రోజు ఫీల్డిండ్ చేస్తున్న టైంలో అశ్విన్ బౌలింగ్ చేస్తున్న టైంలో ఇషాన్.. విరాట్ కోహ్లీని టీజ్ చేశాడు. ‘విరాట్ భాయ్ కొంచెం నిటారుగా నిల్చోండి. చూసి బాల్ విసరండి. బాల్ వేయడానికి మీకు ఆ ప్లేసే దొరికిందా’అంటూ కామెంట్ చేశాడు. దాంతో టీంలో ఉన్న వాళ్లంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. వీడియో చూసిన నెటిజన్స్.. ప్రతిసారి అందరినీ విరాట్ ఆడుకుంటే.. ఇప్పుడు అతని వంతొచ్చింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Ishan Kishan Stump Mic Recording 😂😂😂🤣🤣🤣#indiavswestindies #IshanKishan #YashasviJaiswal #ViratKohli𓃵 #1STTEST pic.twitter.com/XuVZC8sQKK
— THE BSA NEWS (@BsaNewsOfficial) July 12, 2023