IND vs ENG: భారత గడ్డపై సచిన్ రికార్డ్ బ్రేక్ చేసిన జో రూట్

By :  Bharath
Update: 2024-01-25 09:43 GMT

భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య రసవత్తరమైన టెస్ట్ సిరీస్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. మ్యాచ్ ఆచితూచి ఆరంభించినా.. టీమిండియా బౌలర్లు దాటికి ఇంగ్లాండ్ చాప చుట్టేసింది. కాగా నాలుగో వికెట్లో వచ్చిన జో రూట్ (29) అరుదైన రికార్డ్ ను నెలకొల్పాడు. భారత్- ఇంగ్లాండ్ మధ్య జరిగిన ద్వైపాక్షిక టెస్ట్ సిరీసుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడినా రూట్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. తొలి ఇన్నింగ్స్ లో 10 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రూట్ ఈ ఘనత సాధించాడు. సచిన్ 32 మ్యాచుల్లో 2,535 రన్స్ చేయగా, రూట్ 25 మ్యాచుల్లోనే ఆ రికార్డును బ్రేక్ చేశారు. ఆ తర్వాతి స్థానాల్లో సునీల్ గవాస్కర్ (2,348), కుక్ (2,431), కోహ్లి (1,991) ఉన్నారు. కాగా వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ (WTC)లో 4,000 పరుగులు (48 మ్యాచుల్లో) చేసిన తొలి బ్యాటర్ గానూ రూట్ రికార్డు నెలకొల్పాడు.


Tags:    

Similar News