World Cup 2023: బ్యాగులు సర్దేసిన ఇంగ్లాండ్.. కెప్టెన్ బట్లర్ భావోద్వేగం

Byline :  Bharath
Update: 2023-11-05 08:19 GMT

ఆస్ట్రేలియాతో నిన్న రాత్రి జరిగిన అమీతుమీ మ్యాచ్ లో ఓడిన ఇంగ్లాండ్.. వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది. ఆసీస్ పై చివరి వరకు పోరాడిన డిఫెండింగ్ చాంపియన్స్ వరుస ఓటములు చవిచూసింది. ఇప్పటి వరకు ఏడు మ్యాచులు ఆడిన ఇంగ్లాండ్.. ఆరు మ్యాచుల్లో ఓడిపోయింది. దీంతో పాయింట్స్ టేబుల్ లో చివరి స్థానంలో నిలిచింది. ఈ దారుణ పరాజయాలపై మాట్లాడిన ఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ బట్లర్... తాను ఫామ్ కోల్పోవడమే జట్టుకు చేటుచేసిందని ఎమోషనల్ అయ్యాడు. కెప్టెన్ గా ముందుండి నడిపించాల్సిన బట్లర్ ఒక్క మ్యాచ్ లో కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. అంతేకాకుండా ఐదు మ్యాచుల్లో కనీసం 200 పరుగులు కూడా చేయలేకపోయింది.

ఈ క్రమంలో మాట్లాడిన బట్లర్.. తన ఫామ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. చాలా గొప్పగా ఊహించుకుని టోర్నీలోకి అడుపెట్టినట్లు చెప్పుకొచ్చాడు. ఆశించిన స్థాయిలో రాణించక పోవడం తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని చెప్పాడు. తనపై నమ్మకం ఉంచి దేశానికి న్యాయం చేయలేకపోయానని బాధపడ్డాడు. అభిమానులకు సారీ అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. 2019 వన్డే వరల్డ్ కప్, 2022 టీ20 ప్రపంచకప్ గెలిచి ఫేవరెట్ గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్.. ఈ టోర్నీలో దారుణంగా ఫెయిల్ అయింది. బ్యాటింగ్, బౌలింగ్ లో విఫలం అయింది. చిన్న జట్ల చేతిలో కూడా ఓడిపోయింది. కాగా వరల్డ్ కప్ లో ఫెయిల్ అవ్వడంతో ఇంగ్లాండ్ 2024లో జరిగే చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించలేక పోయింది.




Tags:    

Similar News