అంతర్జాతీయ స్పిన్నర్లకు నిరాశ.. ఉనద్కత్ లక్కీ ఛాన్స్

Byline :  Bharath
Update: 2023-12-19 11:45 GMT

ఐపీఎల్ 2024 వేలం జోరుగా సాగుతోంది. మొత్తం 10 ఫ్రాంచైజీలు 77 స్లాట్‌లు కోసం పోటీపడుతున్నాయి. ఇందులో 30 వరకు విదేశీ ఆటగాళ్ల స్లాట్‌లు ఉన్నాయి. భారత్ తో సహా.. మొత్తం 333 మంది ఆటగాళ్లు వేలంలో పోటీ పడుతున్నారు. ప్రస్తుతం మూడు రౌండ్లు ముగిశాయి. శ్రీలంక పేసర్ దిల్షాన్ మధుశంకను ముంబై ఇండియన్స్ రూ. 4.6 కోట్లకు సొంతం చేసుకుంది. టీమిండియా లెఫ్ట్ ఆర్మ్ పేసర్ జయదేవ్ ఉనద్కత్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. అతని కోసం హైదరాబాద్ రూ. 1.6 కోట్లు వెచ్చించింది.

మూడు రౌండ్లు ముగిసేసరికి.. 21 మంది ఆటగాళ్లు అమ్ముడు పోయారు. ఆల్ రౌండర్లు, పేసర్ల కోసం ఎగబడ్డ ఫ్రాంచైజీలు స్పిన్నర్ల వరకు వచ్చేసరికి వెనకడుగేశాయి. కనీస ధర వెచ్చించేందుకు కూడా ఎవరూ ఆసక్తి చూపలేదు. దీంతో అంతర్జాతీయ స్పిన్నర్లు ముజీబ్ ఉర్ రెహమాన్, తబ్రైజ్ షమ్సీ, ఇష్ సోధి, అకేల్ హోసేన్, ఆదిల్ రషీద్ అన్‌సోల్డ్ ప్లేయర్లుగా మిగిలిపోయారు. ఆసీస్ స్టార్ పేసర్ జోస్ హేజిల్ వుడ్ పై కూడా ఏ జట్టు ఆసక్తి చూపలేదు. దీంతో అన్‌సోల్డ్ ఆటగాడిగా మిగిలిపోయాడు. కొన్ని మ్యాచ్ లకు అందుబాటులో ఉండడని అతడు ముందుగానే తెలియజేయడంతో.. ఫ్రాంచైజీలు అతని పట్ల ఆసక్తి చూపలేదని తెలుస్తుంది.

అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితా:

1. రిలీ రోసోవ్

2. కరుణ్ నాయర్

3. స్టీవ్ స్మిత్

4. మనీష్ పాండే

5. ఫిల్ సాల్ట్

6. జోష్ ఇంగ్లిస్

7. కుసాల్ మెండిస్

8. లాకీ ఫెర్గూసన్

9. జోష్ హాజిల్‌వుడ్

10. వకార్ సలాంఖీల్

11. ఆదిల్ రషీద్

12. అకేల్ హోసేన్

13. ఇష్ సోధి

14.తబ్రైజ్ షమ్సీ

15. ముజీబ్ ఉర్ రెహ్మాన్

Tags:    

Similar News