Asian Games 2023 Jyothi Yarraji : చైనా కుటిల బుద్ధి.. గోల్డ్ మిస్ చేసుకున్న తెలుగమ్మాయి
ఏషియన్ గేమ్స్ లో ఆతిథ్య చైనా కుటిల బుద్ధి బయటపడింది. స్వర్ణ పతకం లక్ష్యంగా బరిలోకి దిగిన తెలుగమ్మాయి.. చైనా కుటిల కుయుక్తులకు బలైపోయింది. రజతంతో సరిపెట్టుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మహిళ 100 మీటర్ల హార్డిల్స్ లో జ్యోతి యర్రాజి రజత పతకం సాధించింది. గోల్డ్ గెలుస్తుంది అనుకున్న క్రమంలో చైనా రేసర్ యానివ్ చేతిలో ఓడిపోయింది. రేస్ స్టార్టింగ్ ముందు గన్ షాట్ కొట్టకముందే చైనా రేసర్ పరుగు ప్రారంభించింది. దీంతో జ్యోతి కూడా.. రేసు మొదలయింది అనుకుని పరిగెత్తడం మొదలుపెట్టింది. రేస్ పూర్తైనా తర్వాత అంపైర్లు కొంతసేపు రేస్ ఫుటేజిని పరిశీలించారు. దాంతో గన్ షాట్ కు ముందే చైనా రన్నర్ పరిగెత్తడంతో ఆమెను అనర్హురాలిగా ప్రకటించారు. అదే టైంలో ఉద్దేశపూర్వకంగా ఈ తప్పిందం చేయలేదని జ్యోతిని వదిలేశారు. దీంతో జ్యోతికి రజతం ప్రకటించారు.
అయితే జ్యోతికి పతకం ఇవ్వడంపై ఇద్దరు చైనా రేసర్లు నిరసనకు దిగారు. తనకెలా పతకం ఇస్తారని వాదించారు. ఆ ప్లేస్ లో అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా హెడ్, వెటరన్ లాంగ్ జంపర్ అంజు బాజీ జార్జ్ కూడా అక్కడే ఉన్నాడు. జ్యోతివైపు నుంచి మాట్లాడాడు. రీప్లేలు చూపించి నిజాలు తేల్చాడు. దీంతో యాని వును అనర్హురాలిగా ప్రకటించారు. జ్యోతి ఉద్దేశపూర్వకంగా ఎలాంటి తప్పు చేయలేదని నిర్ధారించి క్వాలిఫై చేశారు. ఇలా ఓ చైనా రేసర్ తప్పిదం వల్ల జ్యోతి గోల్డ్ గెలిచే ఛాన్స్ ను మిస్ చేసుకుంది. అయితేనేం 100 మీటర్ల హార్డిల్స్ లో భారత్ నుంచి పతకం నెగ్గిన తొలి మహిళగా రికార్డ్ సృష్టించింది.