KL Rahul fifty: భారీ స్కోర్ దిశగా టీమిండియా.. పాతుకుపోయిన కేఎల్ రాహుల్

Byline :  Bharath
Update: 2024-01-26 07:05 GMT

ఉప్పల్ లో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టు బిగిస్తుంది. భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. తొలిరోజు ఆటముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది టీమిండియా. యశస్వీ జైశ్వాల్, శుభ్ మన్ గిల్ రెండో రోజు ఆటను కొనసాగించారు. అయితే దాటిగా ఆడే ప్రయత్నంలో గిల్ (23), జైశ్వాల్ (80) త్వరగా వికెట్లు ఇచ్చుకున్నారు. ఇక ఇంగ్లాండ్ గాడిలో పడుతుంది అనుకున్న టైంలో క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ క్రీజులో పాతుకుపోతున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు.




 


ఈ క్రమంలో దాటిగా ఆడుతూ.. బౌండరీల ద్వారా పరుగులు రాబడుతున్న కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. శ్రేయస్ కూడా ఆచితూచి ఆడుతూ రాహుల్ కు సహకారం అందిస్తున్నాడు. తొలి సెషల్ ముగిసేసరికి టీమిండియా 48 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రాహుల్‌ (55, 78 బంతుల్లో), శ్రేయస్‌ (34, 57 బంతుల్లో) ఉన్నారు. ఇదే జోరు కొనసాగితే భారత్ భారీ స్కోర్ చేయడం కాయం.




Tags:    

Similar News