IND vs PAK: ఇది కదా రీఎంట్రీ అంటే.. శతక్కొట్టిన కేఎల్ రాహుల్

By :  Bharath
Update: 2023-09-11 12:57 GMT

కొలంబో స్టేడియంలో భారత బ్యాటర్లు రెచ్చిపోయారు. ఓపెనర్లు రోహిత్, శుభ్ మన్ గిల్ అందించిన శుభారంభాన్ని విరాట్ కోహ్లీ (88, నాటౌట్), కేఎల్ రాహుల్ కొనసాగించారు. దాదాపు 6 నెలలు గాయం కారణంగా ఆటకు దూరం అయిన రాహుల్ (100, 102 బంతుల్లో) అదరగొట్టాడు. సెంచరీతో ఎంట్రీ ఇచ్చాడు. దీంతో భారత్ భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. ప్రస్తుతం 300 పరుగుల మైలురాయికి చేరుకుంది. భారత్ కు ఇంకా 4 ఓవర్లు మిగిలి ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్ తో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ పార్ట్ నర్షిప్ లో 1000 పరుగులు పూర్తయ్యాయి.


Tags:    

Similar News