రబాడా బౌన్సర్ల వర్షం.. భారత్ ను కాపాడిన కేఎల్ రాహుల్

By :  Bharath
Update: 2023-12-26 15:40 GMT

పడిపోతున్న టీమిండియాను తన అద్భుత బ్యాటింగ్ తో నిలబెట్టాడు కేఎల్ రాహుల్. వికట్లు పడుతున్నా.. క్రీజులో నిలదొక్కుకున్నాడు. దీంతో తొలిరోజు ఆట ముగిసే సరికి టీమిండియా 200 పరుగులు చేయగలిగింది. సెంచూరియన్ వేదికగా.. సౌతాఫ్రికా- భారత్ మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో తొలిరోజు ఆట ముగిసింది. సౌతాఫ్రికా బౌలర్లు రెచ్చిపోవడంతో.. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ కుదేలయింది. 160 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ప్రొటీస్ బౌలర్ల దెబ్బకు ఒక్కరంటే ఒక్కరు కూడా క్రీజులో నిలబడలేకపోయారు. కగిసో రబాడా, నాండ్రే బర్గర్, మార్కో జాన్సన్ నిప్పులు చెరగడంతో.. 208 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఆదిలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ (5, 14 బంతుల్లో), యశస్వీ జైశ్వాల్ (17, 37 బంతుల్లో) ఫెయిల్ అయ్యారు. దీంతో టీమిండియా 23 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. శుభ్ మన్ గిల్ (2, 12 బంతుల్లో) కూడా ఫెయిల్ అయ్యాడు.

నాలుగో వికెట్ లో వచ్చిన విరాట్ కోహ్లీ (38, 64 బంతుల్లో), ఐదో వికెట్లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ (31, 50 బంతుల్లో) కాసేపు ఇన్నింగ్స్ ను నిలబెట్టే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. లంచ్ బ్రేక్ తర్వాత టీమిండియా బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. దీంతో భారత్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది. అశ్విన్ (8, 11 బంతుల్లో) కూడా త్వరగానే ఔట్ అయ్యాడు. కాగా మిడిల్ ఆర్డర్ లో వచ్చిన కేఎల్ రాహుల్ (70 నాటౌట్), శార్దూల్ ఠాకూర్ (24) ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. టీ బ్రేక్ తర్వాత శార్దూల్, బుమ్రా క్రీజులో ఎక్కువసేపు నిలబడలేకపోయారు. కేఎల్ రాహుల్ క్రీజులో నిలదొక్కుకోవడంతో.. భారత్ 200 పరుగులకు చేరుకోగలిగింది. అయితే వర్షం కారణంగా మ్యాచ్ కు అంతరాయం ఏర్పాడింది. ఎంతసేపు చూసినప్పటికీ వాన తగ్గకపోయే సరికి అంపైర్లు తొలి రోజు ఆటను ముగించేశారు.





Tags:    

Similar News