KS Bharat : తెలుగబ్బాయి తేలిపోతున్నాడు.. 3rd టెస్టులో KS భరత్పై వేటు తప్పదా?

Byline :  Bharath
Update: 2024-02-06 10:27 GMT

రిషబ్ పంత్ కు యాక్సిడెంట్ అయినప్పటి నుంచి.. బీసీసీఐ టెస్ట్ జట్టు కూర్పు కాస్త కష్టంగా మారింది. అతని స్థానంలో ఓసారి ఇషాన్ కిషన్, మరోసారి కేఎస్ భరత్.. సంజూ శాంసన్ ఇలా సిరీస్ కో ప్లేయర్ ను ఎంపిక చేస్తున్నారు. అయినా ఫలితం మాత్రం కనిపించడం లేదు. రంజీ, దేశవాళీ మ్యాచుల్లో కీపింగ్ బ్యాటింగ్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు. దీంతో భరత్ పై సెలక్టర్లంతా మొగ్గుచూపించారు. స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న సిరీస్ లోనూ.. అందుకే కేఎస్ భరత్ కు అవకాశం ఇచ్చారు. అయితే ప్రతీ మ్యాచ్ లో అవకాశం వచ్చినా.. పరుగులు చేయడంలో విఫలం అవుతున్నాడు. అతనికిచ్చిన స్థానాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇప్పటివరకు 7 టెస్టులు ఆడిన భరత్.. 12 ఇన్నింగ్స్ ల్లో 221 పరుగులు మాత్రమే చేయగలిగాడు. వీటిలో ఒక్క హాఫ్ సెంచరీ లేకపోవడం గమనార్హం.

తన అద్భుతమైన వికెట్ కీపింగ్ నైపుణ్యంతో జట్టులో చోటు దక్కించుకున్నా.. బ్యాటింగ్ లో మాత్రం నిరాశపర్చుతున్నాడు. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తర్వాతి 3 టెస్టులకు జట్టులో భరత్ ఉండటం అనుమానమేనని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. భరత్ స్థానంలో ఇషాన్ కిషన్ ని జట్టులోకి తీసుకోనున్నట్లు కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పాడు. ప్రస్తుతం ఇషాన్ సెలవుల్లో ఉన్నాడని, కానీ జట్టుకు అవసరం అయినప్పుడు తిరిగి వస్తాడని స్పష్టం చేశాడు. మరో వైపు యువ సంచలనం దృవ్ జురెల్ ను ఎంపికచేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. దేశవాళీలో ఉత్తర్ ప్రదేశ్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న జురెల్.. వికెట్ కీపింగ్ చేస్తూ లోయర్ ఆర్డర్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు. 15 ఫస్ట్ క్లాస్ మ్యాచులో 790 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. 

Tags:    

Similar News