World Cup 2023: అదే జోరు.. నెదర్లాండ్స్కు భారీ టార్గెట్

By :  Bharath
Update: 2023-10-09 13:49 GMT

న్యూజిలాండ్ జట్టు.. వరల్డ్ కప్ కోసం ఓ పద్దతి, ఓ ప్రణాళికతో వచ్చినట్లు తెలుస్తుంది. జట్టు ఏదైనా.. ముందు ఏ బౌలర్ ఉన్నా వాళ్ల దుమ్ము దులపడమే పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. మొదటి మ్యాచ్ లో ఇంగ్లాండ్ ను చిత్తు చేసిన కివీస్.. ఇప్పుడు నెదర్లాండ్స్ పనిపడుతుంది. హైదరాబాద్ వేదికపై జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. కివీస్ జట్టులో దాదాపు ప్రతీ బ్యాటర్ రాణించారు. విల్ యంగ్ (70), రచిన్ రవిచంద్ర (51), టామ్ లాథమ్ (53) హాఫ్ సెంచరీలతో మెరిశారు. ఓపెనర్ డేవాన్ కాన్వే (32), డారిల్ మిచెల్ (48), చివర్లో మిచెల్ శాంట్నర్ (36) రాణించారు. దీంతో కివీస్ ఈజీగా 300 పరుగులు దాటింది.

మేమేం తక్కువ కాదు:

ఫామ్ లో ఉన్న కివీస్ బ్యాటర్లను నెదర్లాండ్స్ బౌలర్లు అడ్డుకున్నారు. మేం కూడా ఏం తక్కువ కాదన్నట్లు ప్రదర్శన చేశారు. ఏ ఒక్క బ్యాట్స్ మెన్ ను క్రీజులో కుదుకోనివ్వలేదు. ఏ బ్యాటర్ ను సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడనివ్వకుండా కట్టడి చేశారు. ఇంగ్లాండ్ మ్యాచ్ లో సెంచరీ హీరోలు రచిన్, కాన్వే ఈ మ్యాచ్ లో అంతగా మెరవలేదు. ఇన్నింగ్స్ తొలి మూడు ఓవర్లు డాట్ అయ్యాయంటే.. నెదర్లాండ్స్ బౌలింగ్ అటాక్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా టాప్ టీం న్యూజిలాండ్ లో ఏడుగురు బ్యాటర్లను ఔట్ చేశారు. అయితే కివీస్ బ్యాటర్లు బజ్ బాల్ గేమ్ ఆడటంతో భారీ స్కోర్ చేయడం సాధ్యం అయింది.

Tags:    

Similar News