IND vs PAK: మొదలైన మ్యాచ్.. కన్ఫ్యూజన్లో భారత బ్యాట్స్మెన్

By :  Bharath
Update: 2023-09-11 11:53 GMT

కొలంబోలో వర్షం తగ్గడంతో భారత్, పాకిస్తాన్ మ్యధ్య మ్యాచ్ ఆలస్యంగా మొదలయింది. సాయంత్రం 4:40 గంటలకు మ్యాచ్ రెఫరీ మ్యాచ్ మొదలుపెట్టారు. కాగా నిన్నటి నుంచి వర్షం పడి పిచ్ తడిగా ఉంది. దాంతో పిచ్ కండీషన్ నిన్న ఒకలా, ఇవాళ ఒకలా కనిపిస్తుంది. నిన్న కాస్త బ్యాట్ మీదికి వచ్చిన బాల్ ఇవాళ.. పూర్తి భిన్నంగా వ్యవహరిస్తుంది. బాల్ లో అసలు బౌన్స్ కనిపించడం లేదు. పూర్తిగా ఆగి బ్యాట్ పైకి వస్తుంది. నిన్నంతా బౌన్సర్ల, ఔట్ సైడ్ ఆఫ్ బంతులు ఎదుర్కున్న టీమిండియా పేసర్లు ఇవాళ్టి కండీషన్స్ తో ఇబ్బంది పడుతున్నారు. క్రీజులో ఉన్న విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ కాస్త ఇబ్బంది పడుతున్నారు. బాల్ ను హిట్ చేయకుండా డిఫెండ్ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి భారత్ భారీ స్కోర్ చేయడం అవసరం. ఇదే తీరు కొనసాగితే కష్టమ్యే అవకాశం ఉంది. ఒకవేళ వర్షం పడితే డీఎల్ఎస్ మెతడ్ లో పాక్ కు తక్కువ స్కోరు కేటాయించే సూచనలు ఉంటాయి. ప్రస్తుతం విరాట్, రాహుల్ పిచ్ కండీషన్స్ ను అర్థం చేసుకుని గేర్ మార్చి బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఉంది.



Tags:    

Similar News