IND vs BAN: షకిబల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. బంగ్లా భారీ స్కోరు

Byline :  Bharath
Update: 2023-09-15 13:49 GMT

కొలంబో వేదికపై జరుగుతున్న నామమాత్రపు సూపర్ 4 మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు వచ్చిన బంగ్లా.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. భారత బౌలర్ల దాటికి మొదటి మూడు వికెట్లు త్వరగా కోల్పోయిన బంగ్లా తర్వాత పుంజుకుంది. షకిబల్ హసన్ కెప్టెన్ (80, 85 బంతుల్లో) కెప్టెన్ ఇన్నింగ్స్ కు హిృదయ్ (54, 81 బంతుల్లో) తోడవడంతో భారీ పార్ట్ నర్షిప్ దక్కింది. చివర్లో నసుమ్ అహ్మద్ (44, 45 బంతుల్లో), హసన్ (29) తోడవడంతో బంగ్లా 265 పరుగులు చేసింది. హసన్ మిరాజ్ (13), తాన్జిద్్ (13), లిట్టన్ దాస్ (0), అన్మల్ హక్ (4), షమిమ్ (1) ఫెయిల్ అయ్యారు. టీమిండియా బౌలర్లలో శార్దుల్ 3, షమీ 2 వికెట్లు తీసుకోగా.. ప్రసిద్ద్, అక్షర్, జడేజా తలా ఓ వికెట్ పడగొట్టారు.



Tags:    

Similar News