SA vs AUS : సౌతాఫ్రికా ఆలౌట్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..?
వరల్డ్ కప్ 2023లో భాగంగా జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్లో సౌతాఫ్రికా మోస్తరు లక్ష్యం ఉంచింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుతున్న మ్యాచ్‌లో సఫారీలు 49.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌట్ అయ్యారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జట్టు ఆదిలోనే తడబడింది. వెనువెంటనే వికెట్లు కోల్పోయింది. దక్షిణాఫ్రికా మిడిలార్డర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ 116 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో సెంచరీ చేశాడు. 101 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు.
హెన్రిచ్ క్లాసెన్ 48 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 రన్స్ చేశాడు. ఆసీస్ పేస్ ధ్వయం మిచెల్ స్టార్క్, జోష్ హెజిల్‌వుడ్‌లు ఆరంభం నుంచే సఫారీలకు చుక్కలు చూపించారు.
కెప్టెన్ టెంబా బవుమా (3) తొలి ఓవర్‌లోనే ఔట్ అయ్యాడు. ఆ తర్వాత హెజిల్‌వుడ్ వేసిన ఆరో ఓవర్లో క్వింటన్ డికాక్ (3 )కమిన్స్ చేతికి చిక్కాడు. 31 బాల్స్ ఆడి 6 రన్స్ చేసిన డసెన్‌ను హెజిల్‌వుడ్ ఔట్ చేశాడు. 10 పరుగుల వద్ద మార్క్‌రమ్‌ను స్టార్క్ పెవిలియన్ బాటపట్టించాడు. 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన సఫారీ టీంను క్లాసెన్-మిల్లర్ జోడీ ఆదుకుంది. ఐదో వికెట్‌కు ఇద్దరూ 95 పరుగులు జోడించారు. 19 ఓవర్ల పాటు వికెట్ల పతనాన్ని ఆపిన ఈ జోడీని ఆసీస్ పార్ట్‌టైమ్ స్పిన్నర్ ట్రావిస్ హెడ్ విడదీశాడు. ఒకే ఓవర్లో క్లాసెన్‌తో పాటు మార్కో జాన్సెన్ ను ఔట్ చేశాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన గెరాల్డ్ కొయెట్జ్ (39 బంతుల్లో 19, 2 ఫోర్లు) తో కలిసి ఏడో వికెట్‌కు 76 బంతుల్లో 53 పరుగులు జోడించాడు. 115 బంతుల్లో మిల్లర్ సెంచరీ పూర్తికాగా.. ఆ తర్వాతి బాల్కు కమిన్స్ బౌలింగ్‌లో హెడ్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్‌కు మూడు వికెట్లు దక్కగా హెజిల్‌వుడ్, కమిన్స్, హెడ్‌లు రెండు వికెట్ల చొప్పున తీశారు. హెజిల్‌వుడ్.. 8 ఓవర్లు వేసి 12 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీశాడు.